News July 1, 2024
ప్రధాన కోచ్ రేసులో ఇద్దరి పేర్లు షార్ట్ లిస్ట్: జైషా

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రేసులో ఇద్దరి పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్లు BCCI సెక్రటరీ జైషా తెలిపారు. ‘కోచ్, సెలక్టర్ నియామకం త్వరలోనే జరుగుతుంది. CAC నిర్ణయించిన పేర్లను ప్రకటిస్తాం. జింబాబ్వేకు వెళ్లే జట్టుతో లక్ష్మణ్ కోచ్‌గా వెళ్తారు. కొత్త కోచ్ శ్రీలంక సిరీస్‌తో జాయిన్ అవుతారు’ అని పేర్కొన్నారు. కాగా గంభీర్‌ను కోచ్‌గా ఎంపిక చేశారనే ప్రచారం నడుమ జైషా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Similar News
News February 22, 2025
త్వరలో ఆర్మీ చేతికి 220 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్

తమ అమ్ములపొదిని మరింత శక్తిమంతం చేసుకునేందుకు, గగనతల ప్రమాదాల నుంచి రక్షణకు 220 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్‌ను కొనుగోలు చేయాలని ఆర్మీ భావిస్తోంది. ఈ ఏడాది జూలైలో రెండు దేశీయ సంస్థల ఉత్పత్తుల్ని పరీక్షించనుంది. 1990వ దశకం తర్వాత ఆర్మీ ఈ తరహా వ్యవస్థల్ని కొనుగోలు చేయలేదు. అప్పట్లో కొన్న L-70, Zu-23 వ్యవస్థలు ఔట్‌డేటెడ్ అయిపోయాయి. వాటి స్థానంలోనే ఈ కొత్త గన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.
News February 22, 2025
రాజకీయాల్లోకి 20 ఏళ్ల క్రితమే వచ్చి ఉండాల్సింది: కమల్

రాజకీయాల్లోకి తన ప్రవేశం ఆలస్యమైందని, అందుకే ఓటమిపాలయ్యానని మక్కల్ నీది మయ్యం(MNM) అధ్యక్షుడు కమల్ హాసన్ పార్టీ మీటింగ్‌లో పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితమే వచ్చి ఉంటే ఈరోజు తన పరిస్థితి వేరేగా ఉండేదని వ్యాఖ్యానించారు. తమిళులు భాషకోసం ప్రాణాలిస్తారని, సున్నిత అంశాలతో ఆడుకోవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. పార్లమెంటులో ఈ ఏడాది తమ పార్టీ గొంతు వినిపిస్తుందని కార్యకర్తలకు చెప్పారు.
News February 22, 2025
‘ఛావా’పై వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన నటి

‘ఛావా’ మూవీలో ఔరంగజేబు చేతిలో శంభాజీ అనుభవించిన హింస అంతా కల్పితమని నటి స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చారు. ‘నా ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఛత్రపతి శివాజీ ఘనతల్ని గౌరవిస్తాను. గత వైభవం పేరు చెప్పి నేడు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చకండి అని చెప్పడమే నా ఉద్దేశం. చరిత్ర అందర్నీ కలిపేదిగా ఉండాలని కానీ విడదీసేలా కాదు’ అని సూచించారు.