News July 1, 2024

ఏలూరు: పింఛన్ నిరాకరించిన మహిళ

image

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో పింఛన్ల ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కాగా గ్రామానికి చెందిన సూర్యదేవర పద్మావతి అనే మహిళకు కూటమి నాయకులు రూ.7వేల పింఛన్ అందించారు. కాగా ఆమె తీసుకున్న పింఛన్‌కు రూ.3 వేలు కలిపి మొత్తం రూ.10వేలను తిరిగి కూటమి నాయకులకు ఇచ్చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు సాయంగా ఈ నగదు అందిస్తున్నట్లు ఆమె తెలిపింది.

Similar News

News July 5, 2024

ప.గో.: నర్సు ఆత్మహత్యాయత్నం

image

ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కడగట్ల ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి మమత ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. మమత స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. యువతి స్వగ్రామం నిడదవోలు. ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై సుధాకర్ పరిశీలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

ఏలూరులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

image

ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బిర్లా భవన్ సెంటర్‌లో ఉన్న ఓ మెడికల్ షాప్ దగ్ధం అయింది. ఈ ఘటనలో షాపులోని మందులన్నీ కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా..? మరేదైనా కారణమా..? తెలియాల్సి ఉంది.

News July 5, 2024

కుటుంబ తగాదాలు.. గోదావరిలో దూకి సూసైడ్

image

దేవరపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మెరిపో కిషోర్(33) గురువారం రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిశోర్.. రోడ్డు కం రైలు వంతెనపై మోటారు సైకిల్, చెప్పులు విడిచిపెట్టి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. అతడి మృతదేహం లభ్యమైంది.