News July 1, 2024

BREAKING: హైకోర్టులో కేసీఆర్‌కు చుక్కెదురు

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్‌‌ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Similar News

News February 22, 2025

నేడు మిర్చి యార్డ్, ట్రేడర్లతో సీఎం భేటీ

image

AP: మిర్చి ధరల అంశంపై సీఎం చంద్రబాబు నేడు మిర్చి యార్డ్ అధికారులు, ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ధరల పతనంపై వారితో చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తైంది. అందులో 4లక్షల మెట్రిక్ టన్నుల్ని వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

News February 22, 2025

154మంది భారతీయులకు పాకిస్థాన్ వీసాలు జారీ

image

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో శ్రీ కటాస్ రాజ్ ఆలయాల్ని సందర్శించేందుకు వస్తున్న 154మంది భారతీయులకు వీసాలు జారీ చేశామని ఆ దేశ హైకమిషన్ శుక్రవారం తెలిపింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 2 వరకూ వారు పర్యటిస్తారని పేర్కొంది. ‘ఇరు దేశాల పరస్పర గౌరవం, మతసామరస్యం కోసం ఇలా వీసాలు జారీ చేస్తూనే ఉంటాం’ అని స్పష్టం చేసింది. ప్రతీ ఏటా వేలాదిమంది పర్యాటకులు పాక్‌లో ఆలయాల సందర్శనం కోసం వెళ్తుంటారు.

News February 22, 2025

రెండు కార్పొరేషన్లుగా మారనున్న GHMC?

image

TG: హైదరాబాద్ పరిధి మరింతగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో GHMCపై పడుతున్న భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్‌ అనే 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. 150 డివిజన్లను చెరిసగం విభజించిన అనంతరం శివారు మున్సిపాలిటీలు, గ్రామాల్ని కూడా విలీనం చేయొచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీనిపై కసరత్తు మొదలైందని పేర్కొన్నాయి.

error: Content is protected !!