News July 1, 2024
కడప – చెన్నై ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పరిధిలోని కడప – చెన్నై ప్రధాన రహదారిపై మండపం పల్లి కనము వద్ద కారు, బస్సు ఢీకొన్న ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు వెల్లడించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News January 22, 2026
కడప జిల్లాలో పురాతన తెలుగు శాసనం గుర్తింపు

సిద్ధవటం మండలం టక్కోలి గ్రామానికి తూర్పు దిశగా ఉన్న శివాలయంలో మరో పురాతన తెలుగు శాసనాన్ని గుర్తించినట్లు దక్షిణ భారత పర్యాటక సంస్థ జిల్లా అధ్యక్షుడు జ్యోతి జార్జి, కార్య దర్శి శ్రీనివాసులు తెలిపారు. మాచుపల్లి శ్రీ రేణుకా ఎల్లమాంబ దేవాలయాన్ని దర్శించుకున్న వారు టక్కోలి గ్రామానికి చెందిన శివాలయంన్ని సందర్శించగా అక్కడ ప్రాచీన తెలుగు శాసనం ఉందన్నారు.
News January 22, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.15,580
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,334
* వెండి 10 గ్రాముల ధర: రూ.3150.
News January 22, 2026
జమ్మలమడుగు: 100 ఏళ్ల క్రితం CSI క్యాంప్‌బెల్ ఆసుపత్రి ఫొటో చూశారా.!

జమ్మలమడుగు పట్టణంలోని CSI క్యాంప్‌బెల్ హాస్పిటల్ పురాతనమైనది. అయితే ఈ హాస్పిటల్ 1891వ సంవత్సరంలో జమ్మలమడుగులో నిర్మితమైంది వైద్య సేవల చరిత్రలో CSI క్యాంప్‌బెల్ ఆసుపత్రికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ దాదాపు 100 సంవత్సరాల నాటి ఫొటో బయటపడింది. ప్రస్తుతం ఈ హాస్పిటల్‌కి సూపరింటెండెంట్‌గా డాక్టర్ అగస్టిన్ రాజ్ ఉన్నారు.


