News July 1, 2024

400 కిలోమీటర్ల రోడ్లకు రూ.143 కోట్ల అవసరం !

image

ఉమ్మడి జిల్లాలో రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రోడ్ల మరమ్మతుల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు 143 కోట్లు అవసరం ఉందని రోడ్ల భవనాల శాఖ అధికారులు అంచనా వేశారు. టెండర్లు పిలవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం మారడంతో నిధులు మంజూరు అవుతాయని, భావిస్తున్నారు.

Similar News

News January 17, 2026

MBNR: చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవు: కె.ప్రవీణ

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఫార్మసీ కాలేజీలో కొనసాగుతున్న బీ-ఫార్మసీ V &VII సెమ్ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికాణి డాక్టర్ కే.ప్రవీణ పరిశీలించారు. చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవని, అదేవిధంగా పరీక్ష హాలులో ఏమైనా సమస్యలుంటే చీప్ సూపరింటెండెంట్ దృష్టికి తేవాలని అన్నారు. చీప్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కాంత్ పాల్గొన్నారు.

News January 17, 2026

దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్‌లు తెలంగాణా నుండే రావాలి- CM

image

దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్‌లు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి గ్రామంలో త్రిబుల్ ఐటీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు.

News January 17, 2026

మరికాసేపట్లో ఎంవీఎస్ మైదానానికి సీఎం రేవంత్

image

మహబూబ్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించి భారీ నిధులతో కూడిన ప్రాజెక్టులకు ఆయన ఇక్కడ నుంచి పునాది వేయనున్నారు. సభ కోసం మైదానానికి జనం భారీగా చేరుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.