News July 1, 2024
అందుబాటులోకి ‘టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్’

ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంతువులను రక్షించి వాటికి పునరావాసం కల్పించేందుకు నిర్మించిన ‘టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్’ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటివరకూ ఇందులో ట్రయల్స్ మాత్రమే నిర్వహించగా ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయిలో జంతువుల పరిరక్షణకు అందుబాటులోకి తెచ్చినట్లు రతన్ టాటా తెలిపారు. అపాయింట్‌మెంట్, అత్యవసర సహాయం కోసం <
Similar News
News April 17, 2026
కాసేపట్లో ఓటింగ్.. బలాబలాలు ఇవే

మహిళా రిజర్వేషన్లు(రాజ్యాంగ సవరణ), డీలిమిటేషన్ బిల్లులపై కాసేపట్లో లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ అవసరం. ప్రస్తుతం LSలో 540 మంది సభ్యులు ఉన్నారు. అంటే 360 మంది MPల మద్దతు కావాలి. NDAకి 293 మంది సభ్యుల మద్దతు ఉంది. బిల్లులు పాస్ కావాలంటే మరో 67 మంది MPల సపోర్ట్ అవసరం. అటు విపక్షాల బలం 233. ఎక్కువ మంది విపక్ష పార్టీల సభ్యులు గైర్హాజరైతే బిల్లులు పాసయ్యే ఛాన్స్ ఉంది.
News April 17, 2026
16ఏళ్ల నుంచే రిలేషన్‌షిప్‌లో ఉన్నా: నటి

తాను 16ఏళ్ల వయసు నుంచే రిలేషన్‌షిప్స్‌లో ఉన్నానని ఆలియా భట్ సోదరి, నటి పూజాభట్ వెల్లడించారు. ఇప్పుడు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని.. విడాకుల తర్వాత స్వేచ్ఛగా బతుకుతున్నానని తెలిపారు. 2003లో మనీశ్ మఖీజాను పెళ్లిచేసుకున్న పూజా భట్ 2014లో డైవర్స్ తీసుకున్నారు. 50+ ఏజ్‌లో జిమ్‌కు వెళ్లడం అలవాటైందని, ఇప్పుడు అది తనకు టెంపుల్‌లాంటిదని అన్నారు. హన్సిక కూడా ఇలాగే <<19671407>>సింగిల్<<>> లైఫ్‌పై కామెంట్స్ చేశారు.
News April 17, 2026
లోక్‌సభ నియోజకవర్గంగా అమరావతి!

AP: డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రంలో LS స్థానాలు 38కి చేరుతాయి. దీంతో ప్రస్తుత 25 సీట్లతో పాటు మరో 13 ఏర్పాటవుతాయి. నియోజకవర్గాల పరిధులూ మారుతాయి. రాజధానిగా చట్టబద్ధ హోదా దక్కిన అమరావతి కొత్త నియోజకవర్గంగా అవతరించే అవకాశం ఉంది. గతంలోని తెనాలి, బొబ్బిలి, గుడివాడ, మార్కాపురం వంటి సీట్లు తిరిగి ఏర్పాటు కావచ్చని తెలుస్తోంది. 2011 జణగణన ప్రకారం చేస్తే ఒక్కో స్థానం పరిధిలో 13L జనాభా ఉంటారు.


