News July 1, 2024
‘దండన’ కాదు ‘న్యాయం’ ముఖ్యం: అమిత్ షా

దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చిన సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన 77ఏళ్ల తర్వాత ‘స్వదేశీ’ చట్టాలు అమలులోకి వచ్చాయన్నారు. తమకు ‘దండన’ కంటే ‘న్యాయం’ ముఖ్యమని అన్నారు. గతంలో పోలీసుల హక్కులకు మాత్రమే రక్షణ ఉండేదని, ఇప్పుడు బాధితులు, ఫిర్యాదుదారుల హక్కులకూ రక్షణ ఏర్పడిందని పేర్కొన్నారు.
Similar News
News January 24, 2026
స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు: హరీశ్

TG: భట్టి విక్రమార్క ఎన్ని సాకులు <<18943730>>చెప్పినా<<>> బొగ్గు కుంభకోణం, అందులో రేవంత్ బామ్మర్ది రింగ్‌మెన్ పాత్ర పోషించడం నిజమని హరీశ్ రావు ఆరోపించారు. లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు ‘భట్టి గారూ మీరంటే నాకు చాలా గౌరవం. దీనిపై సిట్టింగ్ జడ్జి, CBI విచారణ కోసమే కిషన్‌రెడ్డికి లేఖ రాశా. రేవంత్, అతని బామ్మర్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాస్తా’ అని తెలిపారు.
News January 24, 2026
ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

<
News January 24, 2026
భార్య సూచననే పాటించా: సూర్య కుమార్

468 రోజుల తర్వాత <<18940538>>అర్ధసెంచరీ<<>> చేసిన సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తిరిగి ఫామ్‌లోకి రావడానికి భార్య దేవిషా ఇచ్చిన సలహానే కారణమని చెప్పారు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకోమని ఆమె సూచించినట్లు తెలిపారు. న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లో ఇదే పాటించానని SKY పేర్కొన్నారు. నిన్నటి మ్యాచులో 37 బంతుల్లో 82 రన్స్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.


