News July 1, 2024

కర్నూలు జిల్లా ఆవిర్భవించింది ఈరోజే

image

పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవైన కర్నూలు జిల్లా ఇదే రోజున ఆవిర్భవించింది. 1858 జులై 1 నుంచి 166 సంవత్సరాలుగా కర్నూలు జిల్లా కేంద్రంగా సేవలందిస్తోంది. ఒకప్పుడు కందెనవోలుగా ప్రసిద్ధి చెంది కాలక్రమేణా కర్నూలుగా మారింది. 1953 OCT 1 నుంచి 1956 OCT 31 వరకు ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కొనసాగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 6 నియోజకవర్గాలతో నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పాటైంది.

Similar News

News October 7, 2024

అలంపూర్ మా అమ్మమ్మగారి ఊరు: కర్నూలు కలెక్టర్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ జోగులాంబ శ్రీబాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు ఆదివారం కర్నూలు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంపూర్ తన అమ్మమ్మగారి ఊరని, సెలవుల్లో ఇక్కడికి వచ్చి గడిపే వాళ్ళమని. అలంపూర్‌తో తనకున్న జ్ఞాపకాలను కలెక్టర్ నెమరేసుకున్నారు.

News October 7, 2024

శ్రీశైల మల్లన్న క్షేత్రం.. పుష్ప శోభితం!

image

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉభయ ఆలయాల ప్రధాన ధ్వజస్తంభాలు, ఉపాలయాలను, ముఖద్వారా లను వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన రకరకాల పూలతో స్వామి అమ్మవార్ల ప్రతిబింబాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పుష్పాలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

News October 6, 2024

కర్నూలు: టెట్ పరీక్షకు 256 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలో ఆదివారం టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ వెల్లడించారు. పరీక్షకు మొత్తం 2,435 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 256 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. టెట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినట్లు తెలిపారు.