News July 1, 2024

వీరి మధ్య నిలబడటం గర్వంగా ఉంది: నాగ్

image

‘కల్కీ’ హిట్ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘‘పదేళ్ల క్రితం స్వప్న దత్, ప్రియాంక దత్‌, నేను కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ప్రారంభించాం. ఆ చిత్రం రిస్క్‌తో కూడుకుంది. అదనపు ఖర్చు ఆందోళనకు గురిచేసింది. కానీ పదేళ్ల తర్వాత చూస్తే మేము చేసిన ప్రతి సినిమా విజయం పొందడంతో పాటు మైలురాయిగా నిలిచాయి. వీరి మధ్య నిలబడటం గర్వంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నా’’ అని తెలిపారు.

Similar News

News July 6, 2024

రైతుల అభిప్రాయాలు సేకరించనున్న కేబినెట్ సబ్ కమిటీ

image

TG: రైతుభరోసా విధివిధానాలు రూపొందించడంపై మంత్రివర్గ ఉపసంఘం రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. ఈ నెల 11 నుంచి 16 వరకు అన్ని జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రోజుకు మూడు సమావేశాల చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. 5ఎకరాలు కటాఫ్ పెట్టాలనే దానిపై చర్చించనున్నారు. 16వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం మరోసారి భేటీ కానుంది.

News July 6, 2024

త్వరలో నూతన ఐటీ పాలసీ: లోకేశ్

image

AP: రాష్ట్రంలో కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆకర్షించేందుకు త్వరలో నూతన ఐటీ పాలసీ తెస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆయా రంగాల్లో పెట్టుబడుల పర్యవేక్షణకు గతంలో ఉన్న పోర్టల్‌ను మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. విశాఖలో కంపెనీలకు కేటాయించేందుకు ఎంత మేర భూమి ఉందో నివేదిక ఇవ్వాలన్నారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు.

News July 6, 2024

జులై 6: చరిత్రలో ఈరోజు

image

1901: భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జననం
1930: ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం
1985: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ జన్మదినం
1986: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం మరణం
2002: వ్యాపారవేత్త ధీరుభాయ్ అంబానీ మరణం
ప్రపంచ రేబీస్ దినోత్సవం