News July 1, 2024

NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు: రాహుల్

image

పేద విద్యార్థులు NEETపై నమ్మకం కోల్పోయారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీట్ కోసం విద్యార్థులు ఏళ్ల పాటు చదువుతారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. నీట్ పేద విద్యార్థుల కోసం కాదు ఉన్నత వర్గాల కోసం అనే విధంగా మార్చారు. నీట్ పరీక్ష విధానంలో అనేక లోపాలు ఉన్నాయి’ అని ధ్వజమెత్తారు.

Similar News

News July 6, 2024

భోలే బాబా త్వరలో ప్రజల ముందుకొస్తారు: లాయర్

image

UPలోని హాథ్రస్ తొక్కిసలాట ఘటన అనంతరం పరారీలో ఉన్న భోలే బాబా త్వరలో ప్రజల ముందుకు రానున్నట్లు ఆయన లాయర్ తెలిపారు. కేసు విచారణకు ఆయన సహకరిస్తారని పేర్కొన్నారు. ఇటీవల బాబా నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల విద్య, ఆరోగ్యం, పెళ్లి ఖర్చులను బాబా ట్రస్ట్ భరిస్తుందని వెల్లడించారు.

News July 6, 2024

శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి: భాను ప్రకాశ్

image

AP: తిరుమల శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేయాలని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమలను అధర్మ క్షేత్రంగా మార్చిందని దుయ్యబట్టారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై అనుమానాలు ఉన్నాయన్నారు. YCP హాయంలో రూ.వందల కోట్లు కమిషన్ల రూపంలో దండుకున్నారని, దర్శన టికెట్లు, ప్రసాదాలు, ఇంజినీరింగ్ పనులన్నింటిలో అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

News July 6, 2024

బడ్జెట్ కసరత్తుపై ఆర్థిక శాఖ తర్జనభర్జన

image

AP: అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలా? రెండు, మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పెట్టాలా? అని ఆర్థిక శాఖ తర్జనభర్జన పడుతోంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, చాలా శాఖల్లో లెక్కలు కొలిక్కి రావడం లేదని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయి బడ్జెట్ కష్టమని చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్, APకి నిధుల విషయాల్లో స్పష్టత వచ్చాక పూర్తి బడ్జెట్ పెట్టొచ్చనే ప్రతిపాదనలున్నాయి.