News July 1, 2024

అమల్లోకి BNS.. తెలంగాణలో తొలి FIR నమోదు

image

ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(BNS) చట్టంలో భాగంగా తెలంగాణలో తొలి కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని చార్మినార్‌ పీఎస్ పరిధిలో నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న బైకర్‌పై సెక్షన్ 281 BNS, ఎంవీ యాక్ట్ కింద కేసు పెట్టారు. కొత్త చట్టం ప్రకారం డిజిటల్ FIR నమోదు చేసినట్లు DGP ఆఫీస్ ట్వీట్ చేసింది. కాగా IPC స్థానంలో కేంద్రం BNS తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News September 21, 2024

రేట్ల ఎఫెక్ట్.. BSNLకు పెరిగిన యూజర్లు

image

ఈ ఏడాది జులై మొదటి వారంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలకు 10-27 శాతం పెంచాయి. దీంతో యూజర్లు ఆ ప్రైవేటు టెలికాం కంపెనీలకు షాకిచ్చారు. జులైలో ఎయిర్‌టెల్ 16.9 లక్షలు, VI 14.1 లక్షలు, జియో 7.58 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. అదే సమయంలో BSNLలోకి ఏకంగా 29 లక్షల మంది చేరారు. ధరలు చాలా తక్కువగా ఉండటంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

News September 21, 2024

భద్రతామండలిలో చేరేందుకు భారత్‌కు ఉన్న అడ్డంకులివే

image

ఐరాస భద్రతామండలి(UNSC)లో US, ఫ్రాన్స్, రష్యా, UK, చైనాలు శాశ్వత సభ్యదేశాలు. భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నా సభ్యత్వం మాత్రం దక్కడం లేదు. వీటో అధికారంతో చైనా మోకాలడ్డుతుండటం, ‘వీటో పవర్ లేకుండానే సభ్యత్వం’ అనే ప్రతిపాదనకు భారత్ నిరాకరణ, తాము చెప్పిన మాట భారత్ వినదేమోనన్న పశ్చిమ దేశాల అనుమానాలు, పొరుగు దేశాలపై భారత్‌కు నియంత్రణ లేకపోవడం కారణాలుగా ప్రపంచ రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

News September 21, 2024

నేను ఏసీ వ్యాన్‌లో.. రజనీ నేలమీద: అమితాబ్

image

రజనీకాంత్ వెట్టయాన్ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌కు ఆయన తన వీడియో మెసేజ్‌ను పంపించారు. ‘ఇది నా తొలి తమిళ సినిమా. 1991లో వచ్చిన హమ్ సినిమాలో నేను, రజనీ కలిసి నటించాం. ఆ షూటింగ్‌లో నేను ఏసీ కారవ్యాన్‌లో పడుకుంటే తను మాత్రం సెట్‌లో నేలపై నిద్రించేవారు. ఆ సింప్లిసిటీ చూశాక నేనూ బయటే పడుకునేవాడిని’ అని గుర్తుచేసుకున్నారు.