News July 1, 2024
వరల్డ్ కప్‌తో జైస్వాల్ పోస్ట్.. సూర్య ఫన్నీ సెటైర్

T20WC గెలిచిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని భారత యువ ఓపెనర్ జైస్వాల్ ఇన్‌స్టాలో ఫొటో పోస్టు చేశారు. కాగా ఆ పోస్టుపై ఫన్నీగా స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ‘వర్ణించకు పోయి పడుకో’ అని కామెంట్ చేశారు. అయితే ‘ఆడే ఛాన్స్ ఎలాగూ ఇవ్వలేదు. కనీసం మాట్లాడే ఛాన్స్ అయినా ఇవ్వరా?’ అని నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. WCకి సెలక్టయిన జైస్వాల్‌కు ప్లేయింగ్11లో ఛాన్స్ దొరకని విషయం తెలిసిందే.
Similar News
News January 7, 2026
యాషెస్.. ఎదురీదుతున్న ఇంగ్లండ్

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ ఎదురీదుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 302/8 స్కోర్ చేసింది. దీంతో 119 పరుగుల లీడ్ సాధించింది. యంగ్ బ్యాటర్ జాకోబ్ బెతల్ 142*, డకెట్ 42, బ్రూక్ 42, జేమీ స్మిత్ 26 రన్స్ చేశారు. చేతిలో 2 వికెట్లే ఉండగా చివరి రోజు ఆసీస్ బౌలింగ్‌ను ఎంత మేర తట్టుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే 3-1 తేడాతో కంగారూలు సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
News January 7, 2026
ఆడపిల్లలను ఇలా పెంచాలి

ఈ రోజుల్లో పిల్లల పెంపకం చాలా సవాలుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా ఆడపిల్లలను భయపడకుండా, ధైర్యంగా నిలబడుతూ, తమను తాము ఎలా రక్షించుకోవాలో కచ్చితంగా నేర్పించాలంటున్నారు నిపుణులు. జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా దృఢ సంకల్పంతో ఎలా ఎదుర్కోవాలో అమ్మాయిలకు నేర్పాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రోత్సహించాలి. వారు మంచి పనులు చేస్తే పొగడటం, కొత్త పనిని ప్రయత్నిస్తుంటే ప్రోత్సహించడం ముఖ్యమంటున్నారు.
News January 7, 2026
BREAKING: ప్రభాస్, చిరంజీవి సినిమాల నిర్మాతలకు ఊరట

రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పుష్ప-2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ-2 చిత్రాలకే పరిమితం చేసింది.


