News July 1, 2024

కలెక్టర్‌గా IPS ఉమేశ్ చంద్ర భార్య

image

నక్సలైట్లు, క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టులను అణచివేసిన దివంగత IPS ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి ప.గో. కలెక్టర్‌గా నియమితులయ్యారు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉమేశ్ చంద్రను 1999లో HYDలోని SRనగర్‌లో నక్సలైట్లు కాల్చి చంపారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆయన సేవలకు గౌరవంగా నాగరాణికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ఆమె పదోన్నతులు పొందుతూ తాజాగా ప.గో. జిల్లా కలెక్టర్ అయ్యారు.

Similar News

News September 21, 2024

లంకాధిపతి ఎవరో? నేడే అధ్యక్ష ఎన్నిక

image

ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడి కోలుకుంటున్న శ్రీలంకలో ఇవాళ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 13,421 పోలింగ్ కేంద్రాల్లో 1.7 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా సిట్టింగ్ ప్రెసిడెంట్ రణిల్ విక్రమ సింఘే(యునైటెడ్ నేషనల్ పార్టీ), ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస(బలవేగాయ పార్టీ), కుమార దిస్సనాయకే(నేషనల్ పీపుల్స్ పవర్) మధ్యే పోటీ ఉండనుంది.

News September 21, 2024

చరిత్ర సృష్టించిన అఫ్గాన్

image

రెండో వన్డేలో సౌతాఫ్రికాపై 177 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో రన్స్ పరంగా ఆ జట్టుకు ఇదే బిగ్గెస్ట్ విన్. గతంలో జింబాబ్వేపై 154, 146, బంగ్లాదేశ్‌పై 142, ఐర్లాండ్‌పై 138 పరుగుల తేడాతో గెలిచింది. ఇక సౌతాఫ్రికాకు ఐదో అతిపెద్ద ఓటమి. గతంలో ఇండియా 243, పాక్ 182, శ్రీలంక 180, 178 రన్స్ తేడాతో ఆ జట్టుపై విజయం సాధించాయి.

News September 21, 2024

రేట్ల ఎఫెక్ట్.. BSNLకు పెరిగిన యూజర్లు

image

ఈ ఏడాది జులై మొదటి వారంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలకు 10-27 శాతం పెంచాయి. దీంతో యూజర్లు ఆ ప్రైవేటు టెలికాం కంపెనీలకు షాకిచ్చారు. జులైలో ఎయిర్‌టెల్ 16.9 లక్షలు, VI 14.1 లక్షలు, జియో 7.58 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. అదే సమయంలో BSNLలోకి ఏకంగా 29 లక్షల మంది చేరారు. ధరలు చాలా తక్కువగా ఉండటంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.