News July 1, 2024
ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు భారీగా పెంపు

విద్యార్థి వీసా ఫీజును ఆస్ట్రేలియా 473 అమెరికన్ డాలర్ల నుంచి 1,068 డాలర్లకు పెంచింది. నేటి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఇతర దేశాల నుంచి వలసలను నియంత్రించేందుకు, అంతర్జాతీయ విద్యావిధానాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంలో 5,48,000 మంది ఇతర దేశాల నుంచి అక్కడికి వలస వెళ్లినట్లు ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.
Similar News
News April 17, 2026
ఉమెన్ రిజర్వేషన్ చట్టం యథాతథం.. అమలు బిల్లే వీగింది

చట్టసభల్లో 33% ఉమెన్ రిజర్వేషన్లకు సంబంధించి 2023లో పార్లమెంటు ‘నారీశక్తి వందన్ అధినియం’ బిల్లును పాస్ చేయగా రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. డీలిమిటేషన్‌తో LS స్థానాలు 850కి పెంచి ఆ చట్టం అమలు చేసేందుకు GOVT ఇవాళ 131వ రాజ్యాంగసవరణ బిల్లును ప్రవేశపెట్టగా అది వీగిపోయింది. ఉమెన్ రిజర్వేషన్ చట్టం యథాతథంగా ఉంటుంది. అందుకే రిజర్వేషన్ అమలు బిల్లును భవిష్యత్తులో ప్రవేశపెడతామని రిజిజు ప్రకటించారు.
News April 17, 2026
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం: CM రేవంత్

TG: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత చరిత్రలో గుర్తుండిపోయే క్షణమని పేర్కొన్నారు. రాహుల్, ఖర్గే నాయకత్వంలో విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాయని తెలిపారు. ‘స్టాలిన్, మమత, అఖిలేశ్, శరద్ పవార్, ఉద్ధవ్, లాలూ, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, కమ్యూనిస్టు పార్టీల నేతలకు ధన్యవాదాలు. జైహింద్’ అని ట్వీట్ చేశారు.
News April 17, 2026
డీలిమిటేషన్ బిల్లు వెనక్కి.. కేంద్రానికి బిగ్ షాక్!

మహిళా రిజర్వేషన్లకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు <<19674859>>వీగిపోయింది.<<>> దీంతో డీలిమిటేషన్, యూటీ చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ పరిణామం ఎన్డీఏకు బిగ్ షాక్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్షాలు ఏకతాటిపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంటున్నారు. విపక్షాల అభ్యంతరాలను నివృత్తి చేయడంలో కేంద్రం విఫలమైందంటున్నారు. మీరేమంటారు?


