News July 1, 2024

ఇకపై 420 కాదు 318!

image

చీటింగ్ కేసుకు పాత చట్టంలో ఉన్న సెక్షన్ 420ని కేంద్రం భారతీయ న్యాయ సంహితలో తొలగించింది. ఇకపై ఆ నేరం సెక్షన్ 318 పరిధిలోకి వస్తుంది. దేశద్రోహాన్ని సెక్షన్ 124A నుంచి 152కి, పరువునష్టాన్ని సెక్షన్ 499 నుంచి 356కి, అత్యాచార నేరాన్ని సెక్షన్ 375 నుంచి 63కి, సెక్షన్ 376Dని తొలగించి గ్యాంగ్ రేప్‌ నేరాన్ని సెక్షన్ 70(1) పరిధిలోకి తీసుకొచ్చింది. సెక్షన్ 302ను (హత్యా నేరం) SEC 103 పరిధిలోకి తెచ్చింది.

Similar News

News July 6, 2024

నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టుకి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. 2 రోజుల పాటు ఆయన కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.

News July 6, 2024

శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం

image

AP: శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు నంది విగ్రహం లభ్యమైంది. ఆ శివలింగం వద్ద గుర్తు తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. వాటిని ఆర్కియాలజీకి పంపగా.. ఆ లిపి 14,15వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు. కాగా ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం, పలు తామ్రపత్రాలు బయటపడ్డాయి.

News July 6, 2024

అసెంబ్లీ సీట్లు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి: ఎంపీ వినోద్

image

తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మండలి రాజ్యాంగం ప్రకారం లేదని.. ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దవుతుందన్నారు. ఇవాళ జరిగే ఇద్దరు సీఎంల భేటీలో ఈ అంశంపై చర్చించాలన్నారు. అలాగే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. ఏపీ, తెలంగాణలో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని గుర్తుచేశారు.