News July 1, 2024

జూన్‌లో తగ్గిన యూపీఐ చెల్లింపులు!

image

మే నెలలో రికార్డ్ స్థాయిలో నమోదైన UPI చెల్లింపుల జోరు జూన్‌లో నెమ్మదించింది. లావాదేవీల్లో 1శాతం, వాల్యూలో 2శాతం తగ్గింపు నమోదైంది. మేలో 14.04 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరగగా జూన్‌లో ఆ మొత్తం 13.89 బిలియన్లుగా రికార్డ్ అయింది. లావాదేవీల విలువ ₹20.45 లక్షల కోట్ల నుంచి ₹20.07 లక్షల కోట్లకు తగ్గింది. మరోవైపు మే నెలతో పోలిస్తే IMPS లావాదేవీలు 5%, ఫాస్టాగ్ లావాదేవీలు 4% తగ్గాయి.

Similar News

News July 6, 2024

శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం

image

AP: శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు నంది విగ్రహం లభ్యమైంది. ఆ శివలింగం వద్ద గుర్తు తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. వాటిని ఆర్కియాలజీకి పంపగా.. ఆ లిపి 14,15వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు. కాగా ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం, పలు తామ్రపత్రాలు బయటపడ్డాయి.

News July 6, 2024

అసెంబ్లీ సీట్లు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి: ఎంపీ వినోద్

image

తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మండలి రాజ్యాంగం ప్రకారం లేదని.. ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దవుతుందన్నారు. ఇవాళ జరిగే ఇద్దరు సీఎంల భేటీలో ఈ అంశంపై చర్చించాలన్నారు. అలాగే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. ఏపీ, తెలంగాణలో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని గుర్తుచేశారు.

News July 6, 2024

భోలే బాబా త్వరలో ప్రజల ముందుకొస్తారు: లాయర్

image

UPలోని హాథ్రస్ తొక్కిసలాట ఘటన అనంతరం పరారీలో ఉన్న భోలే బాబా త్వరలో ప్రజల ముందుకు రానున్నట్లు ఆయన లాయర్ తెలిపారు. కేసు విచారణకు ఆయన సహకరిస్తారని పేర్కొన్నారు. ఇటీవల బాబా నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల విద్య, ఆరోగ్యం, పెళ్లి ఖర్చులను బాబా ట్రస్ట్ భరిస్తుందని వెల్లడించారు.