News July 1, 2024
మేధాపాట్కర్‌కు 5 నెలల జైలుశిక్ష

24 ఏళ్ల క్రితం నాటి పరువునష్టం కేసులో ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌కు ఢిల్లీ కోర్టు 5నెలల జైలుశిక్ష విధించింది. నర్మదా బచావో ఆందోళన సమయంలో ఆమె తనను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 2002లో పరువునష్టం దావా వేశారు. తాజాగా కోర్టు మేధాపాట్కర్‌కు 5నెలలు జైలుశిక్ష విధించింది. అలాగే సక్సేనాకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆమెకు సూచించింది.
Similar News
News January 13, 2026
నెలసరికి ముందు రొమ్ము నొప్పా?

నెలసరికి ముందు వక్షోజాల్లో నొప్పి, బరువుగా ఉన్నట్లు అనిపించడం లాంటి సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీన్ని ‘ప్రీ మెన్‌స్ట్రువల్ మాస్టాల్జియా’గా పిలుస్తారు. ఒక వయసు వచ్చాక అండం విడుదల సమయంలో వెలువడే ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఈ నొప్పికి కారణం. అయితే ఈ నొప్పి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణం ఏమో అని చాలా మంది భయపడతారు. కానీ అది అపోహే అంటున్నారు నిపుణులు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.
News January 13, 2026
మేడారం జాతరకు 3 కోట్ల మంది భక్తులు: సీతక్క

TG: గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరకు దాదాపు రూ.250 కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సారి జాతరకు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు భారీగా తరలివెళ్తున్నారు.
News January 13, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరు <


