News July 2, 2024
TODAY HEADLINES

* AP: టెట్ నోటిఫికేషన్ విడుదల
* AP: తొలిరోజు 95% పెన్షన్ల పంపిణీ
* విభజన హామీలపై చర్చకు ఆహ్వానిస్తూ రేవంత్‌కు CBN లేఖ
* వైసీపీ వాళ్లు నాకు శత్రువులు కాదు: పవన్ కళ్యాణ్
* కాంగ్రెస్‌లో చేరిన MLAలతో రాజీనామా చేయించాలి: KTR
* సీతక్కకు హోంమంత్రి పదవి?: మంత్రి రాజనర్సింహ
* భారత్‌లో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు
* పార్లమెంటులో రాహుల్ ‘హిందూ’ వ్యాఖ్యలపై వివాదం
Similar News
News January 14, 2026
BREAKING: భారత్ ఓటమి

టీమ్ ఇండియాతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ సెంచరీ (131*)తో చెలరేగి తమ జట్టుకు విజయాన్ని అందించారు. యంగ్ 87 పరుగులతో రాణించారు. మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరగనుంది.
News January 14, 2026
మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఇరాన్ హెచ్చరికతో..

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తమ దేశంపై అమెరికా స్ట్రైక్ చేస్తే మిడిల్ ఈస్ట్‌లోని US మిలిటరీ బేస్‌లపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఖతర్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి తమ సైనిక బలగాలను అమెరికా వెనక్కి పిలిచింది. ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కాగా మిడిల్ ఈస్ట్‌లో USకు ఇదే అతిపెద్ద మిలిటరీ బేస్. ఇందులో 10వేలకు పైగా అమెరికా సైనికులు ఉంటారు.
News January 14, 2026
ఫోన్ల ధరలు 30% పెరిగే ఛాన్స్: నథింగ్ CEO

స్మార్ట్ ఫోన్ల ధరలు ఈ ఏడాది 30% లేదా అంతకంటే ఎక్కువే పెరగొచ్చని నథింగ్ కంపెనీ CEO కార్ల్ పై అంచనా వేశారు. ఒకవేళ ధరలు పెంచకపోతే స్పెసిఫికేషన్స్‌ను తగ్గించాల్సి వస్తుందన్నారు. మెమరీ, డిస్ ప్లే ధరలు కొన్నేళ్లుగా తగ్గుతూ వచ్చాయని, ఇప్పుడు మెమరీ ధరలు 3 రెట్లు పెరిగాయని చెప్పారు. AI వల్ల స్మార్ట్ ఫోన్లలో వాడే మెమరీ చిప్స్‌కు డిమాండ్ ఏర్పడిందని, నథింగ్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్ల ధరలు పెరుగుతాయన్నారు.


