News July 2, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News February 25, 2026
రేపే రష్మిక-విజయ్ పెళ్లి.. ముహూర్తం ఎన్ని గంటలకంటే?

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి గడియలు దగ్గరపడ్డాయి. వేదమంత్రాల సాక్షిగా రేపు ఉదయం 8 గంటలకు రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు వైభవంగా జరిగాయి. పెళ్లికి ముందు రష్మికకు విజయ్ తల్లి వారసత్వపు గాజులను కానుకగా ఇచ్చారట. ఇక వాళ్లు కనిపించకుండా కేవలం వేడుకల ఏర్పాట్ల ఫొటోలనే వారిద్దరూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు.
News February 25, 2026
మోదీ ఇజ్రాయెల్ ట్రిప్‌పై రాహుల్ విమర్శలు

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. USతో ట్రేడ్ డీల్ క్యాన్సిల్ చేసుకోమని తాను సవాల్ విసిరి 24 గంటలకుపైనే అయిందని.. దీనిపై స్పందించకుండా సైలెంట్‌గా మోదీ ఇజ్రాయెల్ వెళ్లిపోయారని విమర్శించారు. గతంలో ఓసారి ఎప్‌స్టీన్ ఆదేశాలతో ఇజ్రాయెల్‌లో పర్యటించారని.. ఇప్పుడు ఎవరి ఆదేశాలతో మళ్లీ వెళ్లారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నరేంద్ర ‘సరెండర్’ మోదీ అంటూ PMని విమర్శించారు.
News February 25, 2026
తిరిగి జట్టులో చేరనున్న రింకూ సింగ్!

T20 WC: తండ్రికి అనారోగ్యం నేపథ్యంలో చెన్నై క్యాంప్ నుంచి రింకూ సింగ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు జింబాబ్వేతో మ్యాచ్ నేపథ్యంలో ఇవాళ అతడు తిరిగి భారత జట్టులో చేరతారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. అయితే రింకూ తుది జట్టులో ఉంటారా, లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. WCలో ఇప్పటిదాకా అతడు ఆడిన 5 మ్యాచుల్లో 24 రన్స్ మాత్రమే చేయడం గమనార్హం.


