News July 2, 2024

నేడు అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ భేటీ

image

TG: అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం కానున్నట్లు సమాచారం. శాఖల వారీగా అధికారులు సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. శాఖల వారీగా పనితీరు, సమస్యలను సమీక్షించి.. ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వివరించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 12, 2025

ఆఫీసుకు 5 రోజులు రావాలన్న CEO.. 600 మంది రిజైన్

image

వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాలన్న CEOకి ఉద్యోగులు షాకిచ్చారు. పారామౌంట్, స్కైడాన్స్ మీడియా విలీనం తర్వాత CEO డేవిడ్ ఎల్లిసన్ WFH చేస్తున్న వారందరూ వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించారు. లేదంటే బైఅవుట్(స్వచ్ఛందంగా వైదొలగడం) ఆఫర్ తీసుకోవాలని సూచించారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ కంటే కింది స్థాయిలో పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులు ఎల్లిసన్ ఆఫర్‌ను స్వీకరించి రిజైన్ చేశారు.

News November 12, 2025

జీరో బడ్జెట్‌తో సోలో ట్రావెలింగ్

image

అమ్మాయి ఒంటరిగా బయటకువెళ్తే సేఫ్‌గా వస్తుందా రాదా అనే పరిస్థితే ఇప్పటికీ ఉంది. కానీ తమిళనాడుకు చెందిన సరస్వతి నారాయణ అయ్యర్‌ ఒంటరిగా, జీరో బడ్జెట్‌తో దేశమంతా తిరిగేస్తూ ఫేమస్ అయ్యింది. తక్కువ లగేజ్‌, వెళ్లాల్సిన దారిలో లిఫ్ట్‌ అడగడం, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణం సాగిస్తూ ఈమె బడ్జెట్ సోలో ట్రావెలింగ్ చేస్తోంది. తన అనుభవాలను వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

News November 12, 2025

RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్!

image

బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో RCB సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది హోమ్ మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో ఆడొద్దని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకు బదులుగా మహారాష్ట్రలోని పుణే స్టేడియాన్ని ఎంచుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే RCB తమ మ్యాచులను హోమ్ గ్రౌండ్‌లో ఆడకపోవడం ఇదే తొలిసారి కానుంది. అటు సొంత టీమ్ అభిమానులకు నిరాశే మిగలనుంది.