News July 2, 2024

లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా టీడీపీ ఎంపీ

image

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొమ్మిది మందితో కూడిన ప్యానెల్ స్పీకర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో బాపట్ల టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఉన్నారు. ఆయనతో పాటు ఎంపీలు జగదంబికా పాల్, ఎ.రాజా, పి.సి. మోహన్, సంధ్యారాయ్, దిలీప్ సైకియా, శెల్జా, కాకోలీ ఘోష్ దస్తీదార్, అవధేశ్ ప్రసాద్‌లున్నారు. వీరంతా ప్యానెల్ స్పీకర్లుగా సభ నిర్వహణలో ఓం బిర్లాకు సహకరించనున్నారు.

Similar News

News September 20, 2024

ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారు?: షర్మిల

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం చిన్న విషయం కాదని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే ఎందుకు బయటపెట్టలేదని, విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీశారు. జగన్ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.

News September 20, 2024

యూట్యూబ్‌: వీడియో పాస్ చేసినా యాడ్స్ వస్తాయి!

image

YouTubeలో ‘Pause Ads’ అనే ఫీచర్ రానుంది. దీని వల్ల యూజర్లు వీడియో పాస్ చేసినా స్క్రీన్‌పై సైడ్‌కు యాడ్స్ ప్లే అవుతాయి. ఇప్పటికే వీడియోలు చూసేటప్పుడు వస్తున్న యాడ్స్‌తో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. తాజా ఫీచర్‌తో మరింత ఇబ్బంది పడే ఛాన్సుంది. యాడ్స్ వద్దనుకుంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడమే బెటర్ అని నెటిజన్లు అంటున్నారు. INDలో YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు ₹149 నుంచి స్టార్ట్ అవుతుంది.

News September 20, 2024

గ్రీస్‌లో ఇష్టమొచ్చినట్టు ఇళ్లు కొంటున్న ఇండియన్స్

image

జులై, ఆగస్టులో గ్రీస్‌లో భారతీయ ఇన్వెస్టర్ల ఇళ్ల కొనుగోళ్లు 37% పెరిగాయి. ఆ దేశ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ రూల్స్ మారడమే దీనికి కారణం. అక్కడ ఇల్లు కొంటే శాశ్వత నివాసం పొందొచ్చు. 2013లో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో మొదట రూ.2.2 కోట్లు పెట్టుబడి పెడితే చాలు. తక్కువ డబ్బే కాబట్టి ఏథెన్స్ వంటి నగరాల్లో భూముల రేట్లు కొండెక్కాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సెప్టెంబర్1 నుంచి పెట్టుబడిని రూ.7 కోట్లకు పెంచారు.