News July 2, 2024

వైసీపీ ఆఫీసు కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్

image

AP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తూ ఆఫీసుని కూల్చేశారని అన్నారు. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్‌ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Similar News

News November 15, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 15, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.06 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.21 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 15, 2025

బిహార్ రిజల్ట్స్: ఎన్డీఏ డబుల్.. కాంగ్రెస్ ఢమాల్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి ఘోర ఓటమిని తెచ్చిపెట్టాయి. ఎన్డీఏ డబుల్ సెంచరీ కొట్టగా కాంగ్రెస్ మాత్రం 6 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో INCకి 19 సీట్లు రాగా ఈ సారి అందులో మూడో వంతే రావడం గమనార్హం. డబుల్ ఇంజిన్ సర్కారుకే మొగ్గు చూపిన ఓటర్లు రాహుల్ ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇక బీజేపీకి 89 సీట్లు రాగా జనతా దళ్‌కు ఏకంగా 85 వచ్చాయి.

News November 15, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.