News July 2, 2024

6128 బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

దేశంలోని బ్యాంకుల్లో 6128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24, 25, 31 తేదీల్లో ప్రిలిమ్స్, అక్టోబర్ 13న మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ పూర్తైన 20 నుంచి 28 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. SC/ST/PwBD/ESM/DESM అభ్యర్థులకు రూ.175, ఇతరులు రూ.850 ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 17, 2025

అర్జున అవార్డు అందుకున్న దీప్తి జీవాంజి

image

పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన తెలుగు తేజం దీప్తి జీవాంజి అర్జున అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా దీప్తి అవార్డు తీసుకున్నారు. వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన దీప్తి పారాలింపిక్స్ ఉమెన్స్ 400మీ పరుగులో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు.

News January 17, 2025

Veg Mode Fee వసూలుపై జొమాటో CEO క్షమాపణలు

image

కొత్తగా తెచ్చిన ‘వెజ్ మోడ్ ఎనేబుల్‌మెంట్ ఫీ’పై విమర్శలతో జొమాటో వెనక్కి తగ్గింది. తాను వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసినందుకు అదనంగా ₹2 ఛార్జ్ చేయడంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘దేశంలో శాకాహారిగా ఉండటం ఖర్చుతో కూడుకున్నది’ అని జొమాటో CEOను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. ఇది వైరల్ కాగా స్పందించిన CEO దీపిందర్, తప్పుకు క్షమాపణ కోరడంతో పాటు ఈ స్టుపిడ్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేస్తానన్నారు.

News January 17, 2025

స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై ప్రధాని మోదీ ట్వీట్

image

స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో ప్లాంట్ ఈక్విటీ మద్దతు కింద రూ.10,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయించాం. ఆత్మనిర్భర్ భారత్‌ నిర్మాణంలో ఉక్కు రంగ ప్రాముఖ్యతను ఇది వెల్లడిస్తోంది’ అని పేర్కొన్నారు.