News July 2, 2024
NLG: ముగిసిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. మొత్తం 150 మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెడ్ మాస్టర్‌గా ప్రమోషన్ పొందారు. 345 మంది స్కూల్ అసిస్టెంట్లు వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. 450 మంది SGTలు స్కూల్ అసిస్టెంట్లుగా, LFL HMలుగా ప్రమోషన్ పొందారు. చివరి రోజు 1520 మంది SGTలు ఇతర పాఠశాలలకు బదిలీ అయ్యారు. కాగా నేడు వారంతా విధుల్లో చేరనున్నారు.
Similar News
News January 12, 2026
రాష్ట్ర అండర్ 19 కబడ్డీ జట్టు కెప్టెన్‌గా నల్గొండ వాసి

నల్గొండ జిల్లా అనుముల గ్రామానికి చెందిన టి. కార్తీక్ జాతీయ స్థాయి అండర్-19 తెలంగాణ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వరంగల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటడంతో ఈ అవకాశం దక్కింది. ఈ నెల 12 నుంచి 16 వరకు హరియాణాలో జరిగే జాతీయ కబడ్డీ పోటీల్లో కార్తీక్ తెలంగాణ జట్టును నడిపించనున్నాడు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులు, గ్రామస్థులు కార్తీక్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
News January 12, 2026
నల్గొండ జిల్లాలో ఈరోజు టాప్ న్యూస్

చెరువుగట్టులో పాలకమండలి లేక భక్తుల ఇబ్బందులు
కట్టంగూరు: అటవీ భూముల్లో మట్టి అక్రమ తరలింపు
చిట్యాల: హైవే డివైడర్ మధ్యలో మంటలు
చిట్యాల: దాబా ముసుగులో డ్రగ్స్ దందా
నల్గొండ: లక్ష్యానికి దూరంగా మీనం
నల్గొండ : ఏసీబీలో లీక్ వీరులు
కట్టంగూరు: పండుగ పూట ప్రయాణ కష్టాలు
నల్గొండ: కార్పొరేషన్.. గెజిట్ కోసం నీరిక్షణ
నల్గొండ: కార్పొరేషన్‌గా మారితే.. వీరికి లాభమే
News January 11, 2026
నల్గొండ: గంజాయి విక్రయిస్తున్న వారి అరెస్టు

పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్న సయ్యద్ మజీద్ హుస్సేన్, సోహెల్‌ను టాస్క్‌ఫోర్స్, నల్గొండ రూరల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో పట్టుకున్నారు. నిందితుల నుంచి నాలుగున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


