News July 2, 2024
ఒంగోలు: స్పాట్‌లో సమస్యను పరిష్కరించిన కలెక్టర్

ఒంగోలు స్థానిక పట్నంలోని గ్రీవెన్స్ హాలులో సోమవారం జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ఇద్దరు దివ్యాంగులు తమకు వీల్ ఛైర్, రెండు శ్రవణ యంత్రాలు కావాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాకు అర్జీ అందజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమ శాఖను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆ శాఖ సహాయ సంచాలకులు అర్చన వీల్ ఛైర్, వినికిడి పరికరాలు సమకూర్చి కలెక్టర్ వారికి అక్కడే అందజేశారు.
Similar News
News July 4, 2025
ఎస్పీ గారు.. థ్యాంక్యూ: పవన్ కళ్యాణ్

తన పర్యటన సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంపై ఎస్పీ దామోదర్‌ను డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా అభినందించారు. మార్కాపురం పర్యటన అనంతరం హెలిప్యాడ్ వద్ద ఎస్పీని పవన్ ప్రత్యేకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతల స్థితిగతులు సైతం మెరుగ్గా ఉన్నాయని పవన్ చెప్పడం విశేషం.
News July 4, 2025
మార్కాపురం జిల్లాపై మాటెత్తని పవన్..!

మార్కాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మార్కాపురాన్ని ఎప్పుడు జిల్లా చేస్తామనే దానిపై ఆయన ప్రకటన చేస్తారని ఆశగా చూశారు. కానీ మార్కాపురం జిల్లాపై ఆయన ఏం మాట్లాడలేదు. వెలిగొండ ప్రాజెక్టు భూనిర్వాసితులకు నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ ప్రారంభించిన జలజీవన్ మిషన్ పనులను తానే పర్యవేక్షిస్తూ 20నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం.
News May 8, 2025
పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ఒంగోలు మండలం త్రోవగుంట పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా గురువారం సందర్శించారు. అక్కడ పొగాకు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయమైన ధర వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.