News July 2, 2024
₹8,300 కోట్ల స్కామ్.. ఇండో-అమెరికన్‌కు జైలు శిక్ష
ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త, ఔట్‌కమ్ హెల్త్ కోఫౌండర్ రిషి షాకు US కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ₹8,300 కోట్ల కుంభకోణం కేసులో న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువరించారు. అతిపెద్ద కార్పొరేట్ మోసం కేసుల్లో ఇదొకటని పేర్కొన్నారు. కంపెనీ లాభాల్లో ఉందని చెప్పి రిషి టాప్ ఇన్వెస్టర్లు గోల్డ్‌మన్ సాచ్, అల్ఫాబెట్‌లను మోసం చేశారు. యాడ్ల కోసం డబ్బులు తీసుకుని పలు కంపెనీలను బురిడీ కొట్టించారు.
Similar News
News January 16, 2025
ISRO మరో రికార్డ్: SpaDeX విజయవంతం!
ప్రతిష్ఠాత్మక SpaDeX ప్రయోగం విజయవంతమైనట్టు ISRO వర్గాలు తెలిపాయి. అంతరిక్షంలో 2 శాటిలైట్లను డాక్ చేసినట్టు వెల్లడించాయి. త్వరలోనే సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొన్నాయి. DEC 30న PSLV C60 రాకెట్లో SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) శాటిలైట్లను ఇస్రో పంపింది. JAN 12న 3 మీటర్ల దగ్గరకు తీసుకొచ్చి పరిస్థితి అనుకూలంగా లేదని మళ్లీ సురక్షితమైన దూరానికి పంపింది. తాజాగా సక్సెస్ చేసింది.
News January 16, 2025
ఇజ్రాయెల్-గాజా సీజ్‌ఫైర్: 6 వారాల తర్వాత ఏం జరుగుతుందంటే?
ఇజ్రాయెల్-గాజా సీజ్‌ఫైర్ 3 దశల్లో కొనసాగుతుందని హమాస్ విడుదల చేసిన డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. మొదటి దశ 6 వారాలు ఉంటుంది. వారానికి కొందరు చొప్పున చివరి వారం బందీలందరినీ హమాస్ విడుదల చేస్తుంది. రెండో వారం మిలిటరీ ఆపరేషన్స్ శాశ్వతంగా ఆగిపోతాయి. ఇజ్రాయెల్, గాజా పరస్పరం పౌరులు, సైనికుల్ని విడుదల చేస్తాయి. మూడో దశలో మృతదేహాలు, అస్థికలను ఇస్తారు. ఆ తర్వాత 3-5 ఏళ్లలో గాజా పునర్నిర్మాణం మొదలవ్వాలి.
News January 16, 2025
సైఫ్‌పై కత్తితో దాడి.. స్పందించిన ఎన్టీఆర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన <<15167744>>దాడిపై<<>> యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. దీనిపై ‘దేవర’ టీమ్ సైతం స్పందిస్తూ.. ‘ఇది తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాం. త్వరగా కోలుకోండి సైఫ్ సార్’ అని పేర్కొంది.