News July 2, 2024

శ్రీవారి సేవలో స్మృతి మంధాన

image

ఇండియన్ వుమెన్ క్రికెటర్ స్మృతి శ్రీనివాస్ మంధాన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేదాశీర్వచనంతో తీర్థప్రసాదాలు అందజేశారు.

Similar News

News February 21, 2026

చిత్తూరు జిల్లా రైతులకు గమనిక

image

ప్రభుత్వం రైతు విశిష్ట సంఖ్య కోసం నమోదు ప్రక్రియ చేపట్టింది. చిత్తూరు జిల్లాలో 2.55 లక్షల మంది రైతులు ఉండగా 2లక్షల మంది వివరాలే ఇప్పటికీ నమోదయ్యాయి. పీఎం కిసాన్, పంట నష్టం, బీమా, భూసార పరీక్షలు, విత్తనాల పంపిణీకి ఈ సంఖ్య ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ నంబర్ లేకపోతే పథకాలు రావు.

News February 21, 2026

చిత్తూరులో బర్డ్ ప్లూ.. మనుషులకు సోకలేదు!

image

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మనుషులెవరికీ బర్డ్ ప్లూ సోకలేదని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండియన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి వ్యాధి సోకిందనే ప్రచారం అవాస్తవమన్నారు. 54 మంది అనుమానితుల శాంపిల్స్ పరీక్షలకు పంపగా నెగిటివ్గా తేలిందన్నారు. వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News February 20, 2026

చిత్తూరు జిల్లాలో వాహనాల తనిఖీలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు గురువారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టినట్టు వారు వెల్లడించారు. ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాలలో ఈ తనిఖీలు కొనసాగాయి. ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు చెప్పారు.