News July 2, 2024

ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది: అఖిలేశ్ యాదవ్

image

ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘ఈ ఎన్నికల్లో నైతిక విజయం ఇండియా కూటమిదే. మతతత్వ రాజకీయాలు ఎన్నికల్లో ఓడిపోయాయి. బీజేపీ 400 సీట్ల అజెండా ఫెయిలైంది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదు. అందుకే పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఈవీఎంల మీద మాకు ఇప్పటికీ నమ్మకం లేదు. వాటిని తొలగించే దాకా మా పోరాటం ఆగదు’ అని లోక్‌సభలో వ్యాఖ్యానించారు.

Similar News

News September 20, 2024

ENGvsAUS: హెడ్ విధ్వంసం.. ఆసీస్ ఘన విజయం

image

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యాన్ని 44 ఓవర్లలోనే ఛేదించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొడుతున్న ట్రావిస్ హెడ్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. 129 బంతుల్లో అజేయంగా 154 రన్స్(20 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2011లో వాట్సన్ 161* రన్స్ చేశారు.

News September 20, 2024

ప్రభాస్ సినిమాలకు మరింత భారీ బడ్జెట్?

image

‘కల్కి 2898ఏడీ’తో ప్రభాస్ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీంతో ఆయన తర్వాతి సినిమాల నిర్మాతలు బడ్జెట్‌లను మరింత పెంచేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కే స్పిరిట్ మూవీకి మొదట అనుకున్న రూ.300 కోట్ల అంచనా ఇప్పుడు రూ. 500 కోట్లకు చేరినట్లు టాలీవుడ్ టాక్. ఇక సలార్-2, రాజా సాబ్, హను-ప్రభాస్ సినిమాలకూ ఆయా చిత్రాల నిర్మాతలు భారీగా వెచ్చిస్తున్నారని సమాచారం.

News September 20, 2024

ఆ రెండు రోజుల్లో తిరుమల ఘాట్ రోడ్లలో టూవీలర్స్ నిషేధం

image

AP: అక్టోబ‌ర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD వెల్లడించింది. 8న గరుడ సేవ నేపథ్యంలో 7వ తేదీ రాత్రి 9 నుంచి 9న ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో టూవీలర్స్ రాకపోకలను నిషేధించినట్లు తెలిపింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసిన విషయం తెలిసిందే.