News July 2, 2024
కాకినాడ కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం రివ్యూ

AP: కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూ నిర్వహిస్తున్నారు. తొలుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు కార్యకలాపాలపై సమీక్షిస్తున్నారు. అనంతరం శాఖల వారీగా జిల్లాలో స్థితిగతులను అడిగి తెలుసుకోనున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కొండబాబు, పంతం నానాజీ, చినరాజప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News February 5, 2026
స్వెటర్లు ఎలా ఉతకాలంటే?

ఉన్ని బట్టల్ని ఎప్పుడు కూడా వేడి నీటిలో ఉతకకూడదు. గోరువెచ్చగా ఉన్న నీటినే వాడాలి. వాటిని గట్టిగా మెలితిప్పొద్దు. బట్టలు బయటి రంగు వెలవకుండా లోపలికి తిప్పి బట్టల్ని నానబెట్టి ఉతకాలి. అప్పుడే బట్టలకి ఉన్న మురికి, దుమ్ము, ధూళి మొత్తం పోతుంది. వీటిని ఎండలో ఆరేయొద్దు. నీడలో ఆరబెట్టడం మంచిది. హ్యాంగర్‌పై వేలాడదీయడం వల్ల బట్టలు సాగినట్లుగా మారతాయి. కాబట్టి హ్యాంగర్స్ వాడకూడదు.
News February 5, 2026
జీతం కన్నా జీవితం ముఖ్యం!

సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రస్తుతం పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. అయితే ఉద్యోగం పోవడం, లేదంటే పని ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి పని చేయడం తన వల్ల కావట్లేదంటూ HYD మియాపూర్‌లో నిన్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఉద్యోగులు ఒత్తిడికి లోనవకండి. యాజమాన్యం కూడా ఆఫీస్‌లో మంచి పని వాతావరణాన్ని సృష్టించాలి’ అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
News February 5, 2026
CCRSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

చెన్నైలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ <


