News July 2, 2024

జమ్మికుంట: ఈరోజు పత్తి ధర రూ.7,500

image

జమ్మికుంట పత్తి మార్కెట్‌లో పత్తి ధర నిలకడగానే కొనసాగుతుంది. మంగళవారం మార్కెట్‌కు రైతులు 12 వాహనాల్లో 184 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,500, కనిష్ఠంగా రూ.7,200 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధరలు పెరగకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో కొనుగోలు పక్రియ జోరుగా సాగుతుంది.

Similar News

News September 20, 2024

జగిత్యాల: వరి ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష

image

రాబోయే ఖరీఫ్ 2024-25 వరిధాన్యం కొనుగోలుకు సంభందించి వివిధ శాఖల అధికారులతో గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. మద్దతు ధర క్వింటాకు గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, కామన్ రకానికి రూ.2,300 ధర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా ప్యాడి క్లీనింగ్ మిషన్స్, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. టోకెన్ పద్ధతి పాటించాలని సూచించారు.

News September 19, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్య ప్రసాద్.
@ మల్లాపూర్ మండలంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.
@ పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.
@ మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి.
@ వరి ధాన్యం కొనుగోలుపై జగిత్యాల కలెక్టర్ సమీక్ష.

News September 19, 2024

డీజీపీని కలిసిన బీఆర్ఎస్ MLAలు

image

తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులపై వరుస దాడులు, స్థానిక పోలీసుల వైఫల్యం వంటి విషయాలపై రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను HYDలో కలిసి దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన వారిలో కోరుట్ల MLA డా.కల్వకుంట్ల సంజయ్, హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.