News July 2, 2024

ఏపీలో ‘పవర్ స్టార్’ విస్కీ.. వైసీపీ, కూటమి మధ్య వార్

image

AP: కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని వైసీపీ విమర్శించింది. నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్‌ను తెచ్చిందని ఆరోపించింది. దీనికి టీడీపీ-జనసేన కౌంటర్ ఇస్తున్నాయి. ఐదేళ్లలో ప్రమాదకరమైన మద్యంతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను జగన్ తీశారని దుయ్యబట్టాయి. ఈ బ్రాండ్‌లు అన్నీ వైసీపీ తెచ్చినవే అని పేర్కొంటున్నాయి.

Similar News

News March 22, 2026

PSL నుంచి IPLకు శనక

image

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) నుంచి శ్రీలంక T20 కెప్టెన్ దసున్ శనక తప్పుకోనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. IPLలో RR తరఫున ఆయన ఆడే అవకాశముందని పేర్కొన్నాయి. గాయంతో దూరమైన సామ్ కరన్‌ను ఆయన రీప్లేస్ చేస్తారని సమాచారం. కాగా శనకను PSL వేలంలో లాహోర్ క్వాలెండర్స్ 2.2కోట్ల(PKR)కు కొనుగోలు చేసింది. ఇక ఆసీస్ ప్లేయర్ మాక్స్‌వెల్ సహా మరికొంతమంది ఆటగాళ్లు PSL నుంచి తప్పుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News March 22, 2026

కల్తీ పాలు.. 16కు చేరిన మరణాల సంఖ్య

image

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరణాల సంఖ్య 16కు చేరింది. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావు(72) తాజాగా మృతి చెందారు. కల్తీ పాలు తాగడంతో ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు కొండబాబు(64) అనే వ్యక్తి మాత్రమే కోలుకున్నారు. పాలను నిల్వ చేసే ఫ్రీజర్‌లో ఇథిలీన్ గ్లైకాల్ <<19323083>>కలవడంతోనే<<>> ఈ ఘోరం జరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైన విషయం తెలిసిందే.

News March 22, 2026

IPLలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే 69 బంతుల్లో 195* రన్స్

image

అయోధ్య T20 ప్రీమియర్ లీగ్‌లో స్వస్తిక్ చికారా విధ్వంసం సృష్టించారు. గోమతి థండర్ తరఫున ఆడిన ఆయన 69 బంతుల్లోనే 195* రన్స్ చేశారు. ఇందులో 21 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. మరో ప్లేయర్ ప్రియాంశు 54 బంతుల్లో సెంచరీ చేశారు. దీంతో ఆ టీమ్ 20 ఓవర్లలో 307/0 స్కోర్ చేసింది. హిండన్ టైటాన్స్ 218 రన్స్‌కే ఆలౌటైంది. స్వస్తిక్ గతంలో DC, RCB టీమ్‌లలో ఉన్నా ఒక్క మ్యాచూ ఆడలేదు. 2026 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలారు.