News July 2, 2024
సాయంత్రం 4 గంటలకు ప్రధాని ప్రసంగం

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ లోక్‌సభలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు మాట్లాడనున్నారు. నిన్న సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఎన్డీఏ పార్టీ ఎంపీలతో మోదీ సమావేశమైన సంగతి తెలిసిందే. సభలో వ్యవహరించాల్సిన తీరుపై సభ్యులకు ఆయన వివరించారు.
Similar News
News March 12, 2026
డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడొద్దు: సివిల్ సప్లై కమిషనర్

TG: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ అక్రమ వినియోగంపై టోల్ ఫ్రీ నంబర్ల(1967, 180042500333)కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో ₹2.36L విలువైన సిలిండర్లను పట్టుకున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 7 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
News March 12, 2026
టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా కొనసాగడం కష్టమే: మెక్‌గ్రాత్

భారత పేసర్ బుమ్రా టెస్ట్ భవిష్యత్తుపై AUS దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్ ఆందోళన వ్యక్తం చేశారు. వయస్సు పెరుగుతుండడం, వర్క్ లోడ్ కారణంగా బుమ్రా వరుసగా టెస్టుల్లో ఆడటం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లతో జరిగే టెస్టులకే బుమ్రా పరిమితం కావచ్చని, ఇది టెస్ట్ క్రికెట్‌కు పెద్ద లోటని అన్నారు. T20ల్లోనూ టెస్ట్ లెంగ్త్ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అరుదైన బౌలర్ బుమ్రా అని ప్రశంసించారు.
News March 12, 2026
సిమెంట్ రంగంపై యుద్ధ ప్రభావం.. ధరల పెంపు తప్పదా?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇండియాలో సిమెంట్ రంగంపైనా పడిందని ‘ఎలారా క్యాపిటల్’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. గత 15రోజుల్లో ముడి చమురు 39%, థర్మల్ కోల్ 14%, పెట్ కోక్ ధరలు 18% పెరిగాయని తెలిపింది. తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడనుందని, FY27 Q2లో లాభాలు భారీగా తగ్గొచ్చని అంచనా వేసింది. ఈ భారాన్ని భర్తీ చేసేందుకు ఒక సిమెంట్ బస్తాపై ₹6 వరకు పెంచాల్సిన అవసరముందని చెప్పింది.


