News July 2, 2024

‘కుబేర’ నుంచి సాయంత్రం క్రేజీ అప్డేట్

image

శేఖర్ కమ్ముల, ధనుశ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కుబేర’. ఈ మూవీ నుంచి ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు ఎగ్జైటింగ్ న్యూస్ రానున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Similar News

News December 26, 2025

రేపే రాజాసాబ్ ‘ప్రీ రిలీజ్’ ఈవెంట్

image

మారుతీ-ప్రభాస్ కాంబోలో రాజాసాబ్ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్‌కు మూవీ టీమ్ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. HYDలో రేపు సా.5 గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

News December 26, 2025

SM వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

image

16 ఏళ్లలోపు పిల్లలకు SM వాడకాన్ని బ్యాన్ చేసేలా ఆస్ట్రేలియా తరహాలో చట్టం చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇంటర్నెట్‌లో అడల్ట్ కంటెంట్‌ యాక్సెస్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. పేరెంటల్ కంట్రోల్స్‌ అందుబాటులోకి తెచ్చేలా ISPలను ఆదేశించాలని TN మధురై జిల్లాకు చెందిన ఎస్.విజయ్ కుమార్ PIL వేశారు. దానిపై విచారించిన జస్టిస్ జి.జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్‌ పై వ్యాఖ్యలు చేశారు.

News December 26, 2025

వంటింటి చిట్కాలు మీ కోసం

image

* కొబ్బరి చట్నీ చేసేటపుడు అందులో నీళ్ళకు బదులు పాలు పోస్తే మరింత రుచిగా ఉంటుంది.
*బెండకాయముక్కలను ఉప్పుతో కడిగితే కూర జిగురు రాదు.
* గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బు నీళ్ళలో వెనిగర్ కలిపి రుద్దితే పోతాయి.
* టమాటా సూప్ కు మంచి రంగు రావాలంటే అందులో బీట్ రూట్ ముక్క వేయాలి.
* వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.