News July 2, 2024
ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులపై RBI రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
బిల్ పేమెంట్స్‌లో సేఫ్టీ కోసం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌తోనే చెల్లింపులు జరగాలని RBI గతంలో మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఈ సిస్టమ్‌ను బిల్లర్లు యాక్టివేట్ చేసుకోవాలి. HDFC, ICICI, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు దీనిని యాక్టివేట్ చేసుకోలేదు. ఫలితంగా ఫోన్‌పే, క్రెడ్, పేటీఎం వంటి థర్డ్‌పార్టీ యాప్స్ బిల్లులు ప్రాసెస్ చేయలేవు. ఫలితంగా క్రెడిట్ కార్డులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు వీలు పడదు.
Similar News
News November 21, 2024
1995 తర్వాత అత్యధిక పోలింగ్.. ఎవరికి అనుకూలమో?
మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్న 65.1% పోలింగ్ నమోదైంది. 1995లో రికార్డు స్థాయిలో 71.5% ఓటింగ్ నమోదవగా, ఆ తర్వాత ఇదే అత్యధికం. ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవడం తమకే అనుకూలమని మహాయుతి, MVA ధీమాగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ BJP కూటమివైపే మొగ్గు చూపగా, ఈ నెల 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా 1999లో 61%, 2004లో 63.4%, 2009లో 59.7%, 2014లో 63.4%, 2019లో 61.4% పోలింగ్ రికార్డయ్యింది.
News November 21, 2024
పంత్‌కు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు? ఎందుకంటే?
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఐపీఎల్ మెగా వేలంలో రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు పలుకుతారని రైనా, ఉతప్ప, చోప్రా వంటి మాజీలు జోస్యం చెబుతున్నారు. కాగా ఒకే ఒక ప్రయోజనం కోసమే పంత్‌కు భారీ డిమాండ్ ఉందని తెలుస్తోంది. పంత్ ఓ గన్ ప్లేయర్, వికెట్ కీపర్ కూడా. ప్రస్తుతం ఆయన వయసు 27 ఏళ్లే. దీంతో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అతడిని దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News November 21, 2024
జుట్టుకు రంగులు వేసుకుంటున్నారా?
స్టైల్ కోసం జుట్టుకు పింక్, గ్రీన్, బ్లూ లాంటి వైబ్రంట్ కలర్లను వేసుకోవడం ఇటీవల పెరిగింది. వీటివల్ల తొందరగా గ్రే హెయిర్ వస్తుందని, జుట్టు నెరిసిపోతుందనే వాదన చాలా కాలంగా ఉంది. అయితే దీనికి సైంటిఫిక్ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ‘జన్యుపరం, సూర్యరశ్మి, ఒత్తిడి వల్లే జుట్టు నెరుస్తుంది. రంగులు వేసుకోవడం కారణం కాదు. ఆ కలర్లు జుట్టు పైపొరను మాత్రమే ప్రభావితం చేస్తాయి’ అని స్పష్టం చేస్తున్నారు.