News July 2, 2024
కావలి ప్రమాదం తీవ్రంగా కలచివేసింది: మంత్రి సత్యకుమార్ యాదవ్
కావలి వద్ద స్కూల్ బస్సును లారీ ఢీకొనడంతో 15 మంది చిన్నారులు గాయపడటం తనను తీవ్రంగా కలచివేసిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందడం బాధాకరమని, గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి DM&HO నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నానన్నారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించాను.
Similar News
News January 19, 2025
నెల్లూరు: పెరుగుతున్న నిమ్మ ధరలు.. రైతుల్లో ఆనందం
రెండు రోజుల నుంచి నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. ఇటీవల చలి ప్రభావం ఎక్కువ ఉండడంతో ధరలు ఆశించినంతగా లేక రైతులు ఆందోళన చెందారు. గూడూరు మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ. 25 నుంచి రూ. 35 వరకు పలుకుతున్నాయి. నాణ్యత కలిగిన నిమ్మకాయలు రూ. 45 పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. 50 కేజీల లూజు బస్తా రూ. 2,400 నుంచి 3,300 వరకు అమ్ముతున్నారు. నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News January 19, 2025
సూళ్లూరుపేట: పర్యాటకులకు ఉచిత బస్సు సౌకర్యం
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వచ్చే పర్యాటకుల కోసం సూళ్లూరుపేట నుంచి ఆది, సోమవారాల్లో (19,20 తేదీలు) అటకానితిప్ప, నేలపట్టు, బీవీ పాలెం పర్యాటక ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తెలిపారు. ఇందుకోసం 10 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News January 18, 2025
నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ
ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్ర సాకారం అవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు నగరంలో వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు, గాంధీ బొమ్మకు పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో 722 గ్రామ పంచాయతీలతో పాటు, మున్సిపాలిటీలలో కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.