News July 2, 2024
శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్ నియామకం

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్ నియామకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన శ్రీకాకుళం కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాల్లో ఆయన నేతృత్వంలోని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు అవార్డులు సాధించింది.
Similar News
News March 3, 2026
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు- కలెక్టర్

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాలో బాణసంచా తయారీ నిల్వ విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలను అత్యంత కట్టుదిట్టం చేయాలన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద పేలుడుతో 21 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
News March 2, 2026
వికసిత్ భారత్ లక్ష్యాలు ఇంటింటికీ చేరాలి: కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘వికసిత్ భారత్’ లక్ష్యాలు ప్రతి గడపకు చేరాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతనంగా చేపడుతున్న ‘వీబీజీ రాంజీ’ కార్యక్రమ గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి కీలక నిర్ణయాలను వివరించారు. ఈ లక్ష్యాల సాధనలో అధికారులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News March 2, 2026
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 56 అర్జీలు

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 56 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.


