News July 2, 2024

ప్రభుత్వ వెబ్‌సైట్లలో ముఖ్యమైన సమాచారం అదృశ్యం: KTR

image

TG: రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో ముఖ్యమైన సమాచారం అదృశ్యం అయిందని KTR ట్వీట్ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని, విలువైన సమాచారాన్ని భద్రపరచాలని CS శాంతికుమారికి విజ్ఞప్తి చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొన్ని వెబ్‌సైట్లు తొలగించారు. ముఖ్యమైన సమాచారాన్ని కనిపించకుండా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని ఫొటోలు, వీడియోలను లేకుండా చేశారు’ అని ఆరోపించారు.

Similar News

News March 29, 2026

రేపటి మ్యాచ్‌కు విధ్వంసకర బ్యాటర్ దూరం

image

IPL: రేపు RRతో జరిగే మ్యాచ్‌కు విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ దూరమయ్యారు. ట్రైనింగ్‌లో పక్కటెముకల కండరాలు పట్టేయడంతో రేపటి మ్యాచ్ ఆడట్లేదని CSK హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు. త్వరలోనే ఫిటెనెస్ సాధిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తొలి రెండు మ్యాచులు అనంతరం బ్రెవిస్ అందుబాటులో ఉంటారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. రేపు గౌహతిలో ఈ 2 జట్ల మధ్య రాత్రి 7.30గంటలకు మ్యాచ్ జరగనుంది.

News March 29, 2026

జమ్మూకశ్మీర్ ఆటగాడిపై ప్రధాని ప్రశంసలు

image

జమ్మూకశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబీని ప్రధాని మోదీ అభినందించారు. ‘ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత J&K జట్టు తొలి రంజీ ట్రోఫీని సాధించింది. ఈ సీజన్‌లో 60 వికెట్లు తీసిన ఆకిబ్ నబీ ప్రదర్శన గురించి దేశమంతటా చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో అతడి స్ఫూర్తితో మరెందరో ఆ ప్రాంతం నుంచి క్రీడల్లోకి వస్తారు’ అని ‘మన్ కీ బాత్’లో ప్రశంసించారు. కాగా IPL వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.8.4 కోట్లకు దక్కించుకుంది.

News March 29, 2026

ALERT: డిజిటల్ పేమెంట్లలో మార్పులు!

image

డిజిటల్ పేమెంట్స్‌‌లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు RBI కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. ఏప్రిల్ 1 నుంచి అన్ని ఆన్‌లైన్ చెల్లింపులకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్(2FA) తప్పనిసరి చేయనుంది. అంటే OTPతో పాటు పిన్/పాస్‌వర్డ్/బయోమెట్రిక్ ద్వారా లావాదేవీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల సైబర్ నేరగాళ్లకు పాస్‌వర్డ్/OTP తెలిసినప్పటికీ ట్రాన్సాక్షన్ పూర్తి చేయలేరు. దీంతో యూజర్లకు మరింత రక్షణ లభిస్తుంది.