News July 2, 2024
అంబేడ్కర్ కోనసీమ కొత్త కలెక్టర్‌గా మహేశ్ కుమార్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రావిరాల మహేశ్ కుమార్ రానున్నారు. మహేశ్ కుమార్ ప్రస్తుతం APSWREIS సెక్రటరీగా పని చేస్తున్నారు. కాగా.. ఇక్కడి నుంచి బదిలీ అయిన హిమాన్షు శుక్లా పోస్టింగ్ గురించి మెన్షన్ చేయలేదు.
Similar News
News January 3, 2026
RJY: ‘గిరిజన యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి’

రంపచోడవరం జిల్లాకు గిరిజన వీరుడు కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. తమ్మన్నదొర త్యాగాన్ని కేంద్రం గుర్తించినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గిరిజన యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
News January 3, 2026
గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం

కొవ్వూరు ఎరినమ్మ ఘాట్ వద్ద శనివారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పట్టణ సీఐ పీ. విశ్వం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి సుమారు 60 ఏళ్లు పైబడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుడి వద్ద ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440796622కు కాల్ చేయాలన్నారు.
News January 3, 2026
ఈ నెల 3న రాజమండ్రిలో పర్యటించనున్న కమిషన్ చైర్‌పర్సన్

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ జనవరి 3న తూ.గో జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి 11 గంటలకు రాజమండ్రి చేరుకుంటారన్నారు. 12 గంటలకు రాజమండ్రిలో నిర్వహించనున్న ‘మహిళా విద్యావేత్తల సాధికారత –వృత్తి & వ్యక్తిగత సమతుల్యత’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.


