News July 2, 2024

ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ మోసం చేసింది: మోదీ

image

ఎస్సీ, ఎస్టీ సహా అణగారిన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీల వ్యతిరేక పార్టీ అని అంబేడ్కర్ చెప్పారని, నెహ్రూ ప్రభుత్వ విధానాలు నచ్చక ఆయన రాజీనామా చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అంబేడ్కర్‌ను ఓడించిందని విమర్శించారు. జగ్జీవన్‌రామ్ ప్రధాని కాకుండా ఆ పార్టీ అడ్డుకుందన్నారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకమన్నారు.

Similar News

News March 12, 2026

TODAY HEADLINES

image

* గల్ఫ్ పరిస్థితులపై ఆందోళన చెందొద్దు: ప్రధాని మోదీ
* LPG ఉత్పత్తిని 25% పెంచాం: కేంద్రం
* ఎక్కడా గ్యాస్ కొరత లేదు: CM చంద్రబాబు
* క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు: జగన్
* ఖమ్మం భూదాన్ భూములను పేదలకే వాడతాం: భట్టి
* తెలంగాణలో మూడో డిస్కం
* లోక్‌సభ స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం
* గుజరాత్‌కు వస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. ఖండించిన భారత్
* IPL తొలి దశ షెడ్యూల్ రిలీజ్

News March 12, 2026

పిల్లల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్

image

13ఏళ్లలోపు పిల్లలకు యాడ్స్ లేకుండా కేవలం ఫోన్స్, మెసేజెస్‌కే యాక్సెస్ ఉండేలా పేరెంట్ లింక్డ్ అకౌంట్ ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసింది. ఈ అకౌంట్ సెటప్ చేసేటప్పుడు QR కోడ్ స్కాన్ చేసి పిల్లల ఫోన్‌తో పేరెంట్స్ అకౌంట్ లింకప్ చేసుకోవాలి. వాళ్లు కాంటాక్ట్స్‌ను యాడ్/బ్లాక్/రిపోర్ట్ చేసినా పేరెంట్స్‌కు నోటిఫై అవుతుంది. 6 డిజిట్ పిన్‌తో పిల్లల అకౌంట్ సెట్టింగ్స్ మార్చే యాక్సెస్ పేరెంట్స్‌కు కల్పించింది.

News March 12, 2026

ఇరాన్ దాడిని ఖండించిన భారత్

image

గుజరాత్‌కు వస్తున్న థాయిలాండ్ కార్గో షిప్ ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడి చేయడాన్ని భారత్ ఖండించింది. వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టింది. ఈ దాడులు ప్రారంభమైన తొలి దశలోనే భారతీయులు సహా ఎంతో మంది ప్రాణాలు పోయాయని.. వీటి తీవ్రత మరింత పెరిగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా థాయ్ షిప్‌పై దాడి ఘటనలో 20 మందిని రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.