News July 2, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: మహారాష్ట్ర, కేరళ తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ. గో, ప. గో, ఏలూరు, కృష్ణా, NTR, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, YSR, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Similar News
News March 28, 2026
ఆయిల్ పామ్ తోటల్లో పచ్చిరొట్ట ఎరువులతో ప్రయోజనం

పచ్చిరొట్ట ఎరువులు పంటలకు మేలు చేస్తాయి. ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు గల ఆయిల్ పామ్ మొక్కల పాదులలో మూడు అడుగుల దూరములో జనుమువేసి, పూతదశ వరకు పెంచిన తర్వాత దానిని చిన్నచిన్న ముక్కలుగా చేసి పాదులలో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నీటి వృథా అరికట్టటమే కాకుండా నేలలో సేంద్రియ పదార్థాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. దీని వలన కలుపు మొక్కల బెడద తగ్గుతుంది.
News March 28, 2026
పాండ్య ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చారా?

ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందికి హార్దిక్ పాండ్య రివార్డు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందజేసినట్లు ప్రచారం జరిగింది. అదంతా అబద్ధమని ఒక్కొక్కరికి రూ.10వేల చెక్కు ఇచ్చారని నేషనల్ మీడియా క్లారిటీ ఇచ్చింది. కాగా టీ20 ప్రపంచకప్ కోసం పాండ్య వాంఖడే స్టేడియంలో అర్ధరాత్రి వరకు ప్రాక్టీస్ చేశారు. తనకు సహకరించిన గ్రౌండ్ స్టాఫ్‌కు రివార్డు ఇస్తానని అప్పుడే మాట ఇచ్చారు.
News March 28, 2026
ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల కలిగే లాభాలు

వంటల్లో ఆలివ్ ఆయిల్ చేర్చడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఆలివ్స్‌లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండెకు మేలుచేసే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యంతో పాటు కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సాయపడతాయని పలు సర్వేలు తేల్చాయి. జీర్ణ వ్యవస్థతోపాటు చర్మ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి.


