News July 2, 2024

రోహిత్‌కు ఆ అవార్డు ఇవ్వాల్సిందేనంటోన్న ఫ్యాన్స్

image

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ‘ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024’ అవార్డును ఇవ్వాల్సిందేనని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. 2024లో ఇప్పటివరకు రోహిత్ సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటున్నారు. ‘టీ20 వరల్డ్ కప్ గెలుపొందడంలో కెప్టెన్‌గా రోహిత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. WCలో అత్యధిక రన్స్ చేసిన 2వ ఆటగాడు. ICC నిష్పక్షపాతంగా ఉంటే ఆయనకు ఈ అవార్డు వస్తుంది’ అని చెబుతున్నారు.

Similar News

News April 2, 2026

HYD: ‘నో సిగ్నల్ జోన్స్’కోసం వెతుకులాట!

image

​గచ్చిబౌలి గ్లాస్ బిల్డింగ్‌ల మధ్య కాదు.. ఇప్పుడు సిటీ శివార్లలో మన జెన్-జీ వెతుకుతున్నారు. ఇన్‌స్టా స్టోరీలకు కాదు.. ‘ప్రైవసీ’ కోసం ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ‘డంప్ యార్డ్’ స్టైల్ పార్టీలు చేసుకుంటున్నారు. పబ్లిసిటీ లేని పక్కా లోకల్ కిక్కు! ‘సైలెంట్ వాక్స్’ గ్రూపులు కడుతున్నారు. ఎవరికీ చిక్కని, దొరకని ఈ ‘అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్’ ఇప్పుడు HYDలో సెన్సేషన్. యువతలో వస్తున్న ఈ మార్పు మైండ్ బ్లోయింగ్!

News April 2, 2026

ఢిల్లీ సూపర్ విక్టరీ

image

IPL-2026: లక్నోతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన LSG 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్లు రాహుల్ (0), నిస్సాంక (1) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సమీర్ రిజ్వీ (70*) కీలక ఇన్నింగ్సుతో తన జట్టును గెలిపించారు. స్టబ్స్ 39* పరుగులతో రాణించారు. మరో 17 బంతులు మిగిలి ఉండగానే అక్షర్ సేన విక్టరీ అందుకుంది.

News April 2, 2026

VDK ‘రణబాలి’ షూటింగ్ సీన్ లీక్

image

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ నుంచి ఓ సీన్ లీకైంది. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో గుర్రంపై వచ్చిన విజయ్ దేవరకొండ రాయలసీమ స్లాంగ్‌లో మాస్ డైలాగులతో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అనంతపురం జిల్లాలో జరుగుతోంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 11న విడుదల కానుంది.