News July 2, 2024
15 ఏళ్లు అధికారంలో ఉంటాం: కేసీఆర్

TG: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, 15 ఏళ్లపాటు పవర్‌లో కొనసాగుతామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో పార్టీ ZP ఛైర్‌పర్సన్స్‌తో ఆయన మాట్లాడారు. ‘మనం అధికారంలోకి వచ్చాక YSR పథకాలైన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పేర్లు మార్చకుండా కొనసాగించాం. కానీ నేడు కొందరు కేసీఆర్ జాడల్నే తుడిచేయాలనుకుంటున్నారు. అంటే తెలంగాణనే తొలగిస్తారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News March 18, 2026
HYD: రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

SM వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సెక్యూరిటీ గార్డు వెంకన్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు చెందిన సోషల్ మీడియా ‘రీల్’ కింద ఇతడు అత్యంత అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ PSకి తరలించి విచారణ చేస్తున్నారు.
News March 18, 2026
పితృత్వ సెలవులు ఇవ్వాలి: సుప్రీంకోర్టు

దేశంలోని ఉద్యోగులందరికీ పితృత్వ సెలవులు వర్తించే విధంగా చట్టం తేవాలని SC అభిప్రాయపడింది. దత్తతలో <<19406877>>మాతృత్వ<<>> సెలవులపై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో తండ్రుల పాత్ర కీలకమని, నవజాత శిశువులకు నాన్న మాటలు, స్పర్శ ఎంతో అవసరమని పేర్కొంది. పిల్లల పెంపకం ఏ ఒక్కరి పనో కాదని, వారి బాధ్యతను సమానంగా పంచుకోవాలంది. కాగా ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు ఉద్యోగులకు ఇది అమల్లో ఉంది.
News March 18, 2026
బత్తాయి చెట్లు ఎండిపోతున్నాయా?

వేరుకుళ్లు తెగులు సోకినప్పుడు చెట్లు వడలి కాయలు రాలిపోతాయి. దీని నివారణకు 1% బోర్డో మిశ్రమం లేదా 0.2% కార్బండిజమ్(లీటరు నీటికి 2గ్రా. చొప్పున) మిశ్రమం 20 లీటర్లు పాదుల్లో పోయాలి. ఒక్కో చెట్టుకు 10KGల మేర వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరివిడిని చెట్ల పాదుల్లో కలియబెట్టాలి. ట్రైకోడెర్మా రెస్సీ 100గ్రా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 100గ్రా, 2KGల వేప పిండి, 25KGల పశువుల ఎరువుతో కలిపి పాదుల్లో వేసుకోవాలి.


