News July 2, 2024
భేటీకి సిద్ధం.. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ

విభజన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. విభజన హామీలపై చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ.. ఈ నెల 6న సాయంత్రం ప్రజాభవన్‌లో భేటీకి సిద్ధమని చెప్పారు. చంద్రబాబు రాసిన లేఖను తాను చదివానని.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన అంశాలపై చర్చిద్దామని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఏపీలో కూటమి విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 29, 2026
పశ్చిమాసియా యుద్ధానికి నెల.. కీలక ఘటనలు

*FEB 28- సుప్రీం లీడర్ ఖమేనీ హతం. స్కూల్‌పై మిస్సైల్ పడటంతో చిన్నారులు సహా 170 మంది మృతి
*MAR 2- హార్ముజ్ జలసంధి మూసివేత. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు
*MAR 8- కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఎన్నిక
*MAR 16- ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ హతం
*MAR 18- ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై ఇజ్రాయెల్ దాడి
*MAR 21- హార్ముజ్ తెరవాలని ట్రంప్ అల్టిమేటం
News March 29, 2026
‘బైకర్’ కోసం శర్వానంద్ 23 కేజీలు తగ్గారు: డైరెక్టర్

‘బైకర్’ సినిమా కోసం శర్వానంద్ 6 నెలలు బ్రేక్ తీసుకొని ఫిజికల్‌గా, మెంటల్‌గా ప్రిపేర్ అయ్యారని డైరెక్టర్ అభిలాష్ వెల్లడించారు. ప్రొఫెషనల్ బైకర్‌లా కనిపించడానికి 23KGల బరువు తగ్గారని తెలిపారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు అనేక ప్రమాదాలు జరిగాయని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. తండ్రిగా, కోచ్‌గా రాజశేఖర్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది.
News March 29, 2026
భారీగా తగ్గిన చికెన్ ధరలు

గత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.370-380 పలకగా ఇప్పుడు రూ.270కి తగ్గింది. వరంగల్‌లోనూ అదే ధర ఉంది. ఏపీలోని విజయవాడలో రూ.340, రాజమండ్రిలో 300, అమలాపురంలో రూ.300-350 పలుకుతోంది. అటు ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు. మరి మీ ఏరియాలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.


