News July 2, 2024

రాష్ట్రంలో 213 మంది ఖైదీల విడుదల

image

TG: రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరందరూ రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. విడుదలైన తర్వాత ఖైదీలందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని పేర్కొంది. కాగా ప్రస్తుతం విడుదలయ్యే వారిలో 205 మంది జీవిత ఖైదు పడ్డవారే ఉన్నారు.

Similar News

News March 13, 2026

విద్యార్థులూ.. ట్రిపుల్ ఐటీ ఎదురుచూస్తోంది!

image

TG: 2026-27కు సంబంధించి బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. టెన్త్ మార్కుల ఆధారంగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు <>వెబ్‌సైట్‌<<>> ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 16న నోటిఫికేషన్ రానుంది. 18వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

News March 13, 2026

మూసీ అభివృద్ధికి అదే స్ఫూర్తి: రేవంత్

image

TG: మూసీ పునరుద్ధరణ కోసం దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి నగరాల్లో పర్యటించి అక్కడి నదీ అభివృద్ధి నమూనాలను స్టడీ చేశామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర దేశాల అభివృద్ధి వేగాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. నిజాం కాలంలోనే చార్మినార్ చుట్టూ స్పెషల్ ఎకనమిక్ జోన్‌ను ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేశారని, అదే స్ఫూర్తితో మూసీ తీరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

News March 13, 2026

మూసీ పరీవాహకం నివాసయోగ్యం కాదు: రేవంత్

image

TG: HYDలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల పట్ల తాను కూడా సానుభూతితో ఉన్నానని CM రేవంత్ తెలిపారు. కానీ కింద ఉన్న నల్గొండ జిల్లా వాసుల పరిస్థితి అర్థం చేసుకోండని సూచించారు. ఎవరికో నష్టం కలిగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ‘మూసీ పరీవాహకం నివాసయోగ్యమైనది కాదని WHO స్వయంగా నివేదిక ఇచ్చింది. అక్కడ నివసించే మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో పండించే పంటలు విషపూరితమైపోయాయి’ అని తెలిపారు.