News July 2, 2024

సాయం కోసం భారత మాజీ హెడ్ కోచ్ ఎదురుచూపు

image

టీమ్ఇండియా మాజీ హెడ్‌కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌‌తో పోరాడుతున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స కోసం తనకు ఆర్థిక సాయం కావాలని ఆయన కోరినట్లు మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ బీసీసీఐకి తెలిపారు. T20WC గెలిచిన భారత జట్టుకు రూ.125 కోట్లు ఇచ్చినట్లే, ఆయనకూ సాయం చేయాలని కోరారు. దీనిపై బీసీసీఐ వర్గాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Similar News

News July 8, 2024

ఏపీ టెట్ షెడ్యూల్‌లో మార్పులు

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. జులై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్‌కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్‌ను ఇవాళ రిలీజ్ చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

News July 8, 2024

ఏపీ టెట్ కొత్త షెడ్యూల్‌ ఇదే..

image

✒ పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3 వరకు అవకాశం
✒ ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు 3 వరకు
✒ ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌: సెప్టెంబర్‌ 19 నుంచి
✒ పరీక్షలు: అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు(2 సెషన్లలో)
✒ ప్రొవిజినల్‌ కీ: అక్టోబర్‌ 4నుంచి
✒ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్‌ 5 నుంచి
✒ తుది కీ విడుదల: అక్టోబర్‌ 27
✒ ఫలితాలు విడుదల: నవంబర్‌ 2న

News July 8, 2024

స్మృతి మంధాన లవర్ ఇతనే..

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో రిలేషన్‌ను మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్ఛల్‌ అధికారికంగా ప్రకటించారు. తమ ప్రేమ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయని తెలుపుతూ వారిద్దరూ కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు మంధాన లవ్ సింబల్స్‌తో కామెంట్ చేసింది. కాగా స్మృతి, పలాష్ పలుమార్లు కలిసి కనిపించినా తమ బంధంపై ఎప్పుడూ నోరువిప్పలేదు.