News July 3, 2024

APSPDCL యాప్, వెబ్సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించండి

image

నెల్లూరు జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ఏపీఎస్పీడీసీఎల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఎస్‌ఈ వి విజయన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు ఇకపై వినియోగదారులు వివిధ రకాల యూపీఐ పేమెంట్లు ద్వారా నేరుగా బిల్లులు చెల్లించకూడదన్నారు. యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి తద్వారా లింక్ చేయబడిన యూపీఐ ద్వారానే బిల్లులు చెల్లించాలన్నారు.

Similar News

News July 8, 2024

నెల్లూరు: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే పోలీసులు మృతుడి వయసు సుమారు 55 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News July 8, 2024

నెల్లూరు: ఉద్యోగం కోసం వెళుతూ దుర్మరణం

image

ఉద్యోగం కోసం వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గూడూరు బాలాజీనగర్‌కు చెందిన సురేశ్‌కుమార్(44) ఓ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ నిలిచిపోయాడు. ఈక్రమంలో ఉద్యోగం కోసం మిత్రుడు ప్రశాంత్‌తో కలిసి నెల్లూరుకి స్కూటీపై బయల్దేరారు. బెంగళూరు నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కొమ్మలపూడి వద్ద హైవేపై ఢీకొట్టడంతో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రశాంత్‌కు గాయాలయ్యాయి.

News July 8, 2024

నెల్లూరు: DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్

image

నెల్లూరు జిల్లాకు చెందిన SC, ST, BC కులాలకు చెందిన DSC అభ్యర్థులకు నెల్లూరులోని BC స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని ఆ శాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 10తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో రూ.3 వేలు స్టైపెండ్, స్టడీ మెటీరియల్‌ అందజేస్తారన్నారు. వివరాలకు నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌‌లో సంప్రదించాలని అన్నారు.