News July 3, 2024

పొదుపు ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి: కలెక్టర్

image

ఓర్వకల్లులో సాగిన పొదుపు ఉద్యమం అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిందని కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఓర్వకల్లులోని బాలభారతి పాఠశాల మైదానంలో మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం రజతోత్సవ మహాసభ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మగవాళ్లు చదువుకుంటే ఆ కుటుంబం పైకి వస్తుందని, ఒక మహిళ చదువుకుంటే ఇంటితో పాటు సమాజంలో ఉన్న వారందరూ పైకి వస్తారని అన్నారు.

Similar News

News July 8, 2024

నంద్యాల: భూ తగదా.. వేట కొడవలితో దాడి

image

డోన్ మండలం వెంకటనాయునిపల్లెలో భూ తగాదా హత్యాయత్నానికి దారి తీసింది. స్థానికుల వివరాలు.. మాదయ్యను అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు చెన్నయ్య, ఇంద్రప్ప ఆదివారం సాయంత్రం వేట కొడవలితో తలపై నరికారు. తీవ్ర గాయాలైన మాదయ్యను వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News July 8, 2024

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండండి: నంద్యాల ఎస్పీ

image

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి సూచించారు. సైబర్ నేరగాళ్లు తాము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని మీకు ఇన్సూరెన్స్ యాడ్ చేస్తామని ఒక యాప్ లింక్ పంపి దాంట్లో మీ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాలని అడుగుతారని వివరాలు తెలపగానే క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు మాయం చేస్తారని తెలిపారు. ఎవరైనా ఫోన్ ద్వారా వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పవద్దని సూచించారు.

News July 8, 2024

నేడు కలెక్టరెట్‌లో ప్రజా ఫిర్యాదుల వేదిక: నంద్యాల కలెక్టర్ 

image

నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ఈ ప్రక్రియను పీజీఆర్‌ఎస్‌ ద్వారా చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ స్థాయిలో కూడ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.