News July 3, 2024

హెల్మెట్ లేకుంటే కేసు నమోదు చేయండి: ఎస్పీ మాధవరెడ్డి

image

ద్విచక్ర వాహన ప్రయాణికులు హెల్మెట్ కచ్చితంగా ధరించాలని, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రహదారి ప్రమాదాల నివారణపై అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి వారికి జైలు శిక్ష పడేటట్లు చేయాలన్నారు.

Similar News

News July 8, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీగార్డు దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మీనారయణ విధులు ముగించుకుని బైక్‌లో వెళుతుండగా బత్తలపల్లి మండలం ముష్టూర్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అభిషేక్

image

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. 

News July 7, 2024

డి.హీరేహల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి స్పాట్ డెడ్ 

image

రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన డి.హీరేహల్ మండలంలో ఆదివారం జరిగినట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. బళ్లారికి చెందిన ఇద్దరు యువకులు స్కూటీపై వేగంగా వెళుతూ ఓబుళాపురం వద్ద అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో మహబూబ్ బాషా(21) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బళ్లారికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.