News July 3, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News January 15, 2025
‘కుంభమేళా’పై స్టీవ్ జాబ్స్ లేఖ.. వేలంలో రూ.4.32 కోట్లు
భారత్‌లో జరిగే మహాకుంభమేళా అంటే యాపిల్ కో ఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్‌కు ఎంతో ఇష్టం. ఆయన 19 ఏళ్ల వయసు(1974)లో తన ఆధ్యాత్మిక, ఆత్మ పరిశీలనతోపాటు కుంభమేళాను సందర్శించాలనే ఆకాంక్షను ప్రస్తావిస్తూ స్నేహితుడు టిమ్ బ్రౌన్‌కు లేఖ రాశారు. తర్వాత స్టీవ్ భారత్‌లో దాదాపు 7 నెలలు గడిపారు. 50 ఏళ్ల కిందటి ఈ లెటర్‌ను వేలం వేయగా దాదాపు రూ.4.32 కోట్లు పలికింది. తాజాగా ఆయన సతీమణి పావెల్ కుంభమేళాకు వచ్చారు.
News January 15, 2025
అందుకే కేజ్రీవాల్‌కు మద్దతు: అఖిలేశ్ యాదవ్
ఢిల్లీలో BJPని ఓడించే సత్తా ఆప్‌కు మాత్రమే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. BJPకి వ్యతిరేకంగా పోరాడే ప్రాంతీయ పార్టీలకు INDIA కూటమి నేతలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఏర్పడినప్పుడే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట వాటికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కూటమి పార్టీలు SP, TMC, NCP(SP)లు ఆప్‌కు మద్దతు ప్రకటించాయి.
News January 15, 2025
సంక్రాంతి సెలవులు రేపే లాస్ట్
తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు రేపటితో ముగియనున్నాయి. వీటికి ఈనెల 11 నుంచి 16 వరకు ఇంటర్ బోర్డు హాలిడేస్ ఇచ్చింది. పండగ సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు ఎల్లుండి నుంచి కాలేజీ బాట పట్టనున్నారు. ఇక రాష్ట్రంలోని స్కూళ్లకు 17 వరకు సెలవులు ఉన్నాయి. 18న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అటు ఏపీలోని స్కూళ్లకు 19 వరకు హాలిడేస్.