News July 3, 2024
నేడు మోదీ, అమిత్ షాతో చంద్రబాబు భేటీ

AP: సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినకు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు CM చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని కోరనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ అవుతారు.
Similar News
News January 13, 2026
చైనా మాంజాపై పోలీసు కమిషనర్‌కు HRC నోటీసులు

TG: గాలిపటాలు ఎగురవేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజా కారణంగా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. తీవ్రంగా గాయపడి కొన్నిచోట్ల పిల్లల ప్రాణాలూ పోతున్నాయి. దీనిపై దాఖలైన ఫిర్యాదుతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సీరియస్‌గా స్పందించింది. HYD పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు నోటీసులు జారీచేసింది. ఈ ఘటనలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అడ్వకేట్ రామారావు ఇమ్మానేని HRCలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
News January 13, 2026
Xలో సాంకేతిక సమస్య!

సోషల్ మీడియా మాధ్యమం X(ట్విటర్)లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. యాప్ లోడ్ అవట్లేదని నెటిజన్లు చెబుతున్నారు. ఒక వేళ ప్రయత్నిస్తే Retry అని డిస్ ప్లే అవుతుందని అంటున్నారు. అయితే ఈ సమస్య భారత్‌లోనే ఉందా ఇతర దేశాల్లోనూ ఉందా అనేది తెలియాల్సి ఉంది. మీకు ఇలాంటి సమస్య ఎదురవుతుందా? కామెంట్.
News January 13, 2026
TCSలో మరిన్ని ఉద్యోగాల కోత!

TCSలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. 6 నెలల్లో 30 వేల మందిని ఇంటికి పంపిన కంపెనీ అవసరమైతే మరింత మందిని తీసేస్తామని చెప్పింది. ‘నంబర్ ఇంత అని నిర్ణయించలేదు. కానీ వచ్చే త్రైమాసికంలోనూ తొలగింపులు ఉంటాయి. సరైన కారణం, అంతర్గత ఆడిట్ ద్వారానే ఇవి జరుగుతాయి’ అని తెలిపింది. ప్రస్తుతం TCSలో 5,82,163 మంది పని చేస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్లో 19,755 మంది, డిసెంబర్ క్వార్టర్లో 11,151 మందిని తీసేసింది.


